మాజీ సీఎం వైఎస్ జగన్‌కు క్షమాపణలు చెప్పిన ఆర్టిస్ట్ సునీల్.. ఇంకోసారి చేయనంటూ వీడియో

Wait 5 sec.

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత మోహన్ రెడ్డికి.. నటుడు, క్షమాపణలు తెలియజేశారు. వైఎస్ జగన్‌ను అనుకరిస్తూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో.. సునీల్ రావినూతల పాపులర్ అయ్యారు. అయితే ఇటీవల చేసిన కొన్ని వీడియోలు.. ముఖ్యంగా వైఎస్ జగన్ సతీమణి భారతి రెడ్డి ఫోటోను ఉపయోగించి చేసిన వీడియోపై వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం కావడంతో సునీల్ రావినూతల స్పందించారు. వైఎస్ జగన్‌కు క్షమాపణలు తెలియజేసిన సునీల్ రావినూతల.. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానంటూ వీడియో విడుదల చేశారు." అందరికీ నమస్కారం. జగనన్న గురించి తీసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. నేను సమాజానికి ఇంతలా పరిచయం అవ్వడానికి కారణం జగనన్న వీడియోలు చేయడం. జగనన్న స్క్రిప్టులకు నేను రైటర్ కాదు. డైరెక్టర్ కాదు.. మేము చేసిన వీడియోలలో భారతమ్మ గారి ఫోటో వేయడంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. రైటింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్, ఫోటోలు వేయడంతో నాకు ఎలాంటి సంబంధం లేదు.""నేను కేవలం ఆర్టిస్ట్ మాత్రమే, ఆర్టిస్టుగా నాకు వచ్చిన అవకాశానికి పనిచేశా. నేను కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అడపాదడపా క్యారెక్టర్లు చేసే సమయంలో జగనన్న వేషం వచ్చింది. ఆ క్యారెక్టర్ వేశాను. జగనన్నతో కానీ, ఆయన కుటుంబంతో కానీ నాకు విభేదాలు లేవు. నేను కేవలం ఓ చిన్న ఆర్టిస్టును మాత్రమే. అయినా కూడా జగనన్నకు నేను క్షమాపణలు కోరుకుంటున్నా. జగనన్నా సారీ.. ఇలాంటివి ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటా.." అంటూ సునీల్ రావినూతల వీడియో విడుదల చేశారు.వైసీపీ అధినేత వైఎస్ జగన్ గొంతును దాదాపు కచ్చితంగా అనుకరించి మిమిక్రీ ఆర్టిస్ట్ సునీల్ ఫేమస్ అయ్యారు. ఈయన వీడియోలు ఎంతలా వైరల్ అయ్యాయంటే సోషల్ మీడియాలో ఈయనను అని పిలుస్తుంటారు. ఇక 2024 ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జగన్‌ను ఇమిటేట్ చేస్తూ సునీల్ చేసిన స్కిట్లు. వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా చేసిన ఓ స్కిట్‌లో జగన్ సతీమణి ఫోటోను ఉపయోగించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సునీల్ వైఎస్ జగన్‌కు క్షమాపణలు తెలియజేశారు.