ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా నాయుడు పరామర్శించారు. ఆదివారం ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. సర్జరీ గురించిన వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. తగినంత విశ్రాంతి తీసుకుని.. పూర్తిస్థాయిలో కోలుకోవాలని సూచించారు. వేగంగా కోలుకుని ప్రజా జీవితంలో రావాలని ఆకాంక్షించారు. మరోవైపు శనివారం ఉదయం జరిగింది. గాయాలు తీవ్రంగా ఉన్నాయి. దీంతో ఇటీవల ముంబయి వెళ్లిన అక్కడ కోకిలాబెన్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నివేదికలను పరిశీలించిన డాక్టర్లు.. వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. అయితే ముందుగానే కొన్ని కార్యక్రమాలు షెడ్యూల్ చేసుకున్న నేపథ్యంలో.. ఆ పనులు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత సర్జరీ చేయించుకుంటానని డాక్టర్లకు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం ముంబై వెళ్లగా.. శనివారం ఉదయం పవన్ కళ్యాణ్ కుడి భుజంలోని రొటేటర్ కఫ్ గాయానికి వైద్యులు ఆపరేషన్ పూర్తి చేశారు. రెండు భుజాలకు ఒకేసారి సర్జరీ చేస్తే నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందనే కారణంగా తొలుత కుడి భుజానికి మాత్రమే సర్జరీ చేశారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు నిర్వహించింది. శస్త్రచికిత్సకు మూడున్నర గంటల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎడమ భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. సర్జరీ పూర్తైన తర్వాత రికవరీ రూమ్‌కు తరలించగా.. విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు పరామర్శించారు. మరోవైపు 2016లో పవన్ కళ్యాణ్ భుజానికి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ.. పవన్ కళ్యాణ్ అలాగే సమావేశాలలో పాల్గొన్నారు. 2018 పోరాట యాత్ర సందర్భంగానూ పవన్ కళ్యాణ్ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల తర్వాత రాయలసీమ జిల్లాలలో పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే క్రమంలో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోని పవన్ కళ్యాణ్.. వారాహి యాత్ర, 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ సైనస్ సర్జరీ చేయించుకున్నారు. ఆ సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షలలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయించుకోవాలని సూచించడంతో పవన్ కళ్యాణ్.. ముంబై ఆస్పత్రిలో చేరారు.