అయోధ్య రామాలయ ట్రస్ట్‌లో హైడ్రామా.. చంపత్ రాయ్ రాజీనామాపై ట్విస్ట్.. చివరి నిమిషంలో కీలక మలుపు!

Wait 5 sec.

అయోధ్య రామాలయం విరాళాల కేసు రోజురోజుకూ ఆసక్తికరంగా మారింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాను మొదట ట్రస్టు సభ్యులు అంగీకరించేందుకు నిరాకరించినప్పటికీ, ట్రస్ట్ నిబంధనలను వివరించిన అనంతరం చివరకు ఆమోదించారు. రామ జన్మభూమి ప్రాంగణంలోని సమావేశ మందిరంలో సోమవారం ట్రస్ట్ సమావేశం జరిగింది. ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలను సభ్యుల ముందుంచారు. మొదట చంపత్ రాయ్ రాజీనామాపై చర్చ జరిగింది. చంపత్ రాయ్ రాజీనామాను తిరస్కరించాలని ట్రస్టీలు ఏకగ్రీవంగా అభిప్రాయపడినట్లు సమాచారం.అయితే, ట్రస్ట్ నియమాలను రూపొందించిన సీనియర్ న్యాయవాది, ట్రస్టీ కే. పరాశరన్ వర్చువల్‌గా సమావేశంలో పాల్గొని కీలక వివరణ ఇచ్చారు. ఒక ట్రస్టీ రాజీనామా సమర్పిస్తే దానిని తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని, రాజీనామాను తిరస్కరించే అవకాశం లేదని, అదే వ్యక్తిని మళ్లీ ట్రస్టీగా కొనసాగించాలంటే కొత్తగా నియమించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో ట్రస్టీలు చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించారు. READ ALSO చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం తర్వాత అనిల్ మిశ్రా రాజీనామాపై ఎలాంటి చర్చ జరగలేదని సమావేశానికి సంబంధించిన వర్గాలు తెలిపాయి. మరణించిన ట్రస్టీ విమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా స్థానంలో ఆయన కుమారుడు యతీంద్ర మిశ్రాను ట్రస్టీగా నియమించాలని ట్రస్టీ మహంత్ ధీరేంద్ర దాస్ ప్రతిపాదించారు. అయితే, ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరగలేదు. కొత్త ట్రస్టీల నియామకంపై జూలై 22న జరిగే తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ట్రస్ట్ నిర్ణయించింది. సమావేశంలో రెండో అంశంగా రామాలయ విరాళాల దుర్వినియోగం కేసుపై చర్చ జరిగింది. ట్రస్ట్ ఎక్స్‌-అఫీషియో సభ్యుడు, కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ ప్రసాద్, ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక దర్యాప్తు వివరాలను సభ్యులకు వివరించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఎనిమిది మంది నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రస్టీలు ఏకగ్రీవంగా డిమాండ్ చేసినట్లు సమాచారం.