: పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే అన్నింటికన్నా ముందు గుర్తొచ్చేది బంగారమే. ఈ లోహం అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడింది. ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. దీంతో బంగారానికి మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి సమయంలో బంగారం ధరలు వరుసగా దిగివస్తుండడం ఊరట కల్పించే విషయంగా చెప్పవచ్చు. ఈ జులై నెల ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ ధరలు ఆకాశాన్నంటుతాయని అంతా భావించారు. కానీ, బంగారం ధరలు మళ్లీ వరుసగా తగ్గుతున్నాయి. జులై 4వ తేదీ నుంచి జులై 7వ తేదీ వరకు పసిడి రేట్లు వరుసగా పడిపోయాయి. ఈరోజు జులై 7వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం, కిలో వెండి ధర ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటుఅంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 46 డాలర్ల మేర దిగివచ్చింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4133 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.13 శాతం మేర పడిపోయింది. దీంతో ఔన్స్ వెండి రేటు 61 డాలర్ల వద్దకు దిగివచ్చింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఈరోజు జులై 7వ తేదీ మంగళవారం రోజున 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.110 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,46,620 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.100 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,34,400 వద్ద ట్రేడవుతోంది. రూ.10 వేలు తగ్గిన వెండి ధరబంగారంతో పాటు వెండి ధర సైతం భారీగా తగ్గింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.10 వేల మేర తగ్గింది. దీంతో కిలో సిల్వర్ రేటు రూ.2,50,000 మార్క్ వద్దకు దిగివచ్చింది. గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేటు జులై 7వ తేదీ మంగళవారం రోజున ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు 10 గంటల తర్వాత మారిపోతుంటాయి. కొనుగోలు చేసే సమయంలో స్థానికంగా ఉండే ధరలను తెలుసుకోవడం మంచిది. ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరలు వేరు వేరుగా ఉంటాయి.