Bonus Shares: స్టీల్ అండ్ ఐరన్ రంగానికి చెందిన స్మాల్ క్యాప్ కేటగిరి కంపెనీ గుడ్ లక్ ఇండియా లిమిటెడ్ తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై 2:1 రేషియోలో జారీ చేయాలని నిర్ణయించారు. ఈ బోనస్ షేర్లతో పాటు డిఫెన్స్, ఏరో స్పేస్ సెక్టార్ విస్తరించేందుకు HDFC బ్యాంకుకి రూ.275 కోట్లుకు గాను కార్పొరేట్ గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఈ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. మరి ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఈ బోనస్ ఇష్యూ ప్రకారం కంపెనీకి చెందిన 1 షేర్ కొనుగోలు చేస్తారో వారికి అదనంగా 2 ఈక్విటీ షేర్స్ బోనస్ రూపంలో ఉచితంగా కంపెనీ ఇస్తుంది. ఇలా ఎన్ని షేర్లు కొంటే అంతకు డబుల్ షేర్లు వస్తాయి. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత ఏడాదిలో 40 శాతం లాభాన్ని అందించింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం లభించింది. దీని అర్థం రికార్డు డేట్ నాటికి ఎవరైతే రూ.2 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉంటే వారికి అదనంగా రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉన్న 2 ఈక్విటీ షేర్స్ ని బోనస్ రూపంలో ఉచితంగా జారీ చేస్తారు. ఈ బోనస్ షేర్లను పొందడానికి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ మాత్రం త్వరలోనే ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. చివరి ట్రేడింగ్ సెషన్లో గుడ్ లక్ ఇండియా లిమిటెడ్ షేరు 0.83 శాతం లాభపడి రూ. 1,562.70 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1,575 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 915 వద్ద ఉన్నాయి. గత ఆరు నెలల్లో 39 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఏడాది కాలంలో 40 శాతం లాభాన్ని ఇచ్చింది. గత 5 ఏళ్ల కాలంలో 782 శాతం లాభాన్ని అందించింది. లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొన్నవారికి రూ.9 లక్షలు అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 5190 కోట్లుగా ఉంది.