"మీ కథలు.. మీ బూతులు అన్నీ వింటున్నా..": ప్రకాష్ రాజ్

Wait 5 sec.

ఏపీ రాజకీయాలు, వర్తమాన అంశాలపై సినీ నటుడు మరోసారి స్పందించారు. ప్రశ్నించే తన గొంతును ఎవరూ ఆపలేరన్న ప్రకాష్ రాజ్.. తాను మౌనంగా లేనని.. అన్నీ చూస్తున్నానని అన్నారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. జనసైనికులు, కొంతమంది యూట్యూబర్లు చేస్తున్న అసత్య ప్రచారాలను గమనిస్తున్నానన్న ప్రకాష్ రాజ్.. ఇలాగే దిగజారుతూ ఉండండి అంటూ సెటైర్లు వేశారు. "నేను మౌనంగా లేను, అన్నీ చూస్తున్నా.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, , కొందరికి అమ్ముడుపోయిన ఛానెల్స్, యూట్యూబర్లు, సోషల్ మీడియాలో అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఒక్కటే. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. దిగజారుడుతనం సామర్థ్యం మీద మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి. అరుస్తూ దిగజారండి.. నాలుగు వైపులా దిగజారండి.. సిగ్గులేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా నాలాంటి ప్రశ్నించే గొంతును ఆపలేరు. కానివ్వండి.. మీ పని మీద మీరు ఉండండి.. దిగజారుతూనే ఉండండి.." అంటూ ప్రకాష్ రాజ్ వీడియో విడుదల చేశారు.మరోవైపు అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ అరెస్ట్ కావడం, ఆయనకు మద్దతుగా ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏపీలో రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యారు. గన్నవరం పోలీసులు అతనిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. అయితే ప్రశ్న రావణ్ అరెస్టును ఖండిస్తున్న ప్రకాష్ రాజ్.. ప్రశ్నించే గొంతులు, యూట్యూబర్లు, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ప్రజాస్వా్మ్యానికి విరుద్ధమంటున్నారు. ప్రభుత్వ పిరికితనానికి ఇది నిదర్శనమంటూ ఆయన వరుసగా ట్వీట్లు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తీరుపై సోషల్ మీడియాలో జనసైనికులు, కొంతమంది నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలపైనే తాజాగా వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్..