రూ.2 నుంచి రూ.213కు షేరు ధర.. లక్ష పెడితే ఏకంగా రూ.87 లక్షలొచ్చాయ్.. ఆ పెన్నీ స్టాక్ ఇదే

Wait 5 sec.

Multibagger: స్టాక్ మార్కెట్లో సరైన రీసెర్చ్, ఓపిక ఉంటే భారీ సంపదను సృష్టించవచ్చని ఇప్పటికే చాలా స్టాక్స్ నిరూపించాయి. ఇప్పుడు అదే విషయాన్ని ప్రముఖ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కంపెనీ క్యూపిడ్ లిమిటెడ్ స్టాక్ నిరూపించింది. ఐదేళ్ల క్రితం కేవలం ఒక సాధారణ పెన్నీ స్టాక్స్ గా ఉన్న క్యూపిడ్ షేరు ధర ప్రస్తుతం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. మార్కెట్లో ఒడుదొడుకులు ఉన్నా ఈ స్మాల్ క్యాప్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు ఊహించని లాభాల వర్షం కురిపించింది. లక్ష రూపాయల పెట్టుబడి ఐదేళ్లలోనే రూ. 87 లక్షలు చేసింది. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్యుపిడ్ లిమిటెడ్ షేరు ధర రూ. 213 స్థాయికి చేరుకుంది. గత 5 సంవత్సరాల కాలంలో ఈ స్టాక్ ఏకంగా 8600 శాతం పైగా అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఎవరైనా ఒక ఇన్వెస్టర్ ఐదేళ్ల క్రితం ఈ షేరుపై రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి అలాగే ఉంచుకుని ఉంటే నేడు దాని విలువ ఏకగా రూ. 87 లక్షలకు చేరి ఉంటుంది. కేవలం ఏడాది క్రితం పెట్టిన రూ.1 లక్ష విలువ కూడా ఇప్పుడు రూ. 8.40 లక్షలుగా మారడం గమనార్హం. కంపెనీ త్వరలోనే ప్రకటించబోయే క్యూ1 ఆదాయం సరికొత్త రికార్డ్ స్థాయిలో రూ. 150 కోట్లు దాటుతుందని అంచనా వేసింది. అలాగే పూర్తి ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ గైడెన్స్ 10 శాతం నుంచి రూ. 660 కోట్లుగా కంపెనీ మేనేజ్మెంట్ సవరించింది. అంతర్జాతీయ బిజినెస్ టు బిజినెస్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ టెండర్లు, హెల్త్ కేర్ ప్రొక్యూర్మెంట్ సంస్థలతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు కంపెనీ ఆర్డర్ బుక్ ను బలోపేతం చేశాయి. కంపెనీ కేవలం ఒకే రకమైన ప్రొడక్టుపై ఆధారపడకుండా ఇన్ విట్రో డయాగ్నోస్టిక్స్ వంటి కొత్త హెల్త్ కేర్ విభాగాల్లోకి అడుగుపెట్టడం భవిష్యత్తు వృద్ధికి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. రూ. 212.98 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 226 వద్ద ఉండగా కనిష్ఠ ధర రూ. 21.65 వద్ద ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 28530 కోట్లుగా ఉంది.