ఈ వారం మార్కెట్లోకి SBI ఎంఎఫ్ సహా 6 IPOలు.. జీఎంపీ చూస్తే మైండ్ బ్లాకే.. 118 శాతం లాభాలు!

Wait 5 sec.

IPO Alert: భారతీయ ప్రైమరీ మార్కెట్ ప్రస్తుతం ఊపుమీదుంది. ఈ వారం ఏకంగా 6 కంపెనీలు తమ ఐపీఓలతో దలాల్ స్ట్రీట్‌లో సందడి చేయనున్నాయి. ఇందులో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా ఐపీఓ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కూడా ఉండడం విశేషం. గ్రే మార్కెట్లో ఈ కంపెనీల షేర్లకు భారీ డిమాండ్ పలుకుతోంది. కొన్ని ఐపీఓలు ఏకంగా 118 శాతం వరకు లిస్టింగ్ లాభాలను అందించవచ్చని జీఎంపీ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ఈ వారం ఇన్వెస్టర్ల రాడార్‌లో ఉన్న ఈ ఆ ఐపీఓల పూర్తి వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.ఎస్‌బీఐ ఎంఎఫ్ ఐపీఓ (SBI Mutual Fund IPO) పబ్లిక్ ఇష్యూ. దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కావడం వల్ల ఇన్వెస్టర్లు దీనిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఒక్కే షేరు ధర రూ.574గా నిర్ణయించారు. ప్రస్తుతం జీఎంపీ ధర రూ.88గా ఉంది. అంటే 15.33 శాతం లాభాల్లో లిస్టింగ్ కావచ్చని సూచిస్తోంది. అల్పైన్ టెక్స్ వరల్డ్ ఐపీఓఅల్పైన్ టెక్స్ వరల్డ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ జులై 14వ తేదీన మొదలవుతోంది. జులై 16వ తేదీతో ముగియనుంది. ఒక్కే షేరు ధర రూ.105గా నిర్ణయించగా ఇష్యూ ధర రూ.126.25 కోట్లుగా ఉంది. ఈ ఐపీఓ జీఎంపీ రూ.2గా ఉంది. 1.90 శాతం లాభంతో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.మిల్ వర్క్స్ టెక్నాలజీస్ ఐపీఓమిల్ వర్క్స్ టెక్నాలజీస్ (Millworks Technologies IPO) పబ్లిక్ ఇష్యూ బలమైన గ్రే మార్కెట్ ఇంట్రెస్టును సూచిస్తోంది. బీఎస్ఈ ఎస్ఎంఈ విభాగం నుంచి వస్తున్న ఐపీఓ జీఎంపీ రూ.390గా ఉంది. ఇష్యూ ధర రూ.331తో పోలిస్తే 118 శాతం లాభంతో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.లేజర్ పవర్, ఇన్‌ఫ్రా ఐపీఓఇప్పటికే 1.05 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ జీఎంపీ రూ.36.5 వద్ద ఉంది. ఇష్యూ ధరతో రూ.214తో పోలిస్తే 17 శాతం లాభంతో లిస్టింగ్ కానుంది. డేవ్‌సన్ క్యాటలిస్ట్ ఐపీఓడేవ్‌సన్ క్యాటలిస్ట్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైంది. ఈ షేర్లు జులై 16వ తేదీన లిస్టింగ్ కానున్నాయి. ఈ ఐపీఓ జీఎంపీ 38 శాతంగా ఉంది.హ్యాపీ స్టీల్స్ ఐపీఓహ్యాపీ స్టీల్స్ పబ్లిక్ ఇష్యూ ఈనెల 16వ తేదీనే మార్కెట్లలోకి లిస్టింగ్ కానుంది. ఈ ఐపీఓ జీఎంపీ ఇష్యూ ధరతో పోలిస్తే 21 శాతం లాభంతో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.