లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి .. ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 170 పరుగులకు కుప్పకూల్చిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. దీంతో భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. లార్డ్స్ పిచ్‌పై లభిస్తున్న ఎక్స్‌ట్రా బౌన్స్, స్వింగ్‌ను ఇంగ్లాండ్ పేసర్లు సమర్థవంతంగా వాడుకున్నప్పటికీ, భారత బ్యాటర్లు పట్టుదలతో క్రీజులో నిలదొక్కుకున్నారు. అనంతరం ఇంగ్లాండ్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. 170 పరుగులకే కుప్పకూల్చింది. కీలకమైన 115 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ సత్తాచాటింది. ఏకంగా ఐదు వికెట్లు తీసింది. దీంతో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో టెస్టుల్లో ఫైఫర్ సాధించిన తొలి మహిళా బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. స్నేహ్ రాణా, సయాలి కూడా రెండేసి వికెట్లు తీశారు. దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టింది.తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 115 పరుగుల ఆధిక్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించి, శుభారంభం అందించారు. 55 బంతుల్లో 33 రన్స్ చేశాక షెఫాలీ వర్మ ఔట్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన యస్తికా భాటియా.. స్మృతి మంధానకు జత కలిసింది. వీరిద్దరూ అబేధ్యమైన రెండో వికెట్‌కు 66 పరుగులో జోడించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 154/1తో నిలిచింది. క్రీజులో స్మృతి మంధాన (69), యస్తికా భాటియా (39) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా లీడ్ 269 పరుగులుగా ఉంది.ప్రస్తుతం పిచ్ బౌలర్లకు, బ్యాటర్లకు సమానంగా సహకరిస్తుండటంతో మూడో రోజు ఆట ఈ టెస్ట్ మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ చేతిలో ఇంకా వికెట్లు ఉండటంతో వీలైనంత ఎక్కువ స్కోరు చేసి భారీ ఆధిక్యంతో ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని చూస్తోంది.