టీమిండియా 1,601 రోజుల రికార్డుకు ఎండ్ కార్డ్..!

Wait 5 sec.

సౌతాంప్టన్ వేదికగా శనివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 258 పరుగుల లక్ష్యం నిలిపిన ఆతిథ్య జట్టు.. ఆపై బౌలింగ్‌లోనూ సత్తాచాటింది. భారత్‌ను 201కే పరిమితం చేసి.. ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో భారత్‌ సిరీస్ కోల్పోవడంతో పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కూడా కోల్పోయింది. ఇంగ్లాండ్.. అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది.సౌతాంప్టన్ ఫలితంతో టీ20 క్రికెట్‌లో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లయింది. టీమిండియా 2022 ఫిబ్రవరి నుంచి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్స్ 2024, 2026 కైవసం చేసుకుంది. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా సుదీర్ఘ కాలం హవా కొనసాగించింది. నిజానికి క్రికెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగిన జట్లలో ఒకటిగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఏకంగా 1,601 రోజుల పాటు (నాలుగేళ్లకు పైగా) ప్రపంచ నంబర్ వన్ జట్టుగా భారత్ తన జెండాను ఎగరేసింది.ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లను వారి సొంత గడ్డపైనే కాకుండా భారత్‌లోనూ ఓడిస్తూ ఈ ఘనతను కాపాడుకుంటూ వచ్చింది. కానీ, ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ప్రదర్శన దారుణంగా పడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమవడంతో సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుస పరాజయాలు తప్పలేదు. దానికి తోడు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను సైతం 0-2తో కోల్పోవడం భారత రేటింగ్ పాయింట్లను భారీగా దెబ్బతీసింది.ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఖాతాలో 268 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్.. 268 రేటింగ్ పాయింట్స్‌తో నిలిచింది. రేటింగ్ పరంగా ఇరు జట్లూ సమానంగా ఉన్నప్పటికీ సిరీస్‌ను ఇంగ్లాండ్ గెలుచుకోవడంతో ఆ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ టీ20 ఛాంపియన్‌కు ఘోర ఓటమిని రుచి చూపించింది.