Range Rover: కోటి రూపాయలు అంటే చిన్న కార్లు 10 వరకు కొనుగోలు చేయవచ్చు. కానీ ఈ కారుపై తగ్గింపే కోటి రూపాయలకు పైన ఉంటే ఆశ్చర్యమే కదా. అవునండీ మీరు చదివింది నిజమే. భారత్‌లో టాటా గ్రూప్ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ విక్రయిస్తున్న లగ్డరీ కార్లపై కోటి రూపాయల వరకు ధర తగ్గించారు. అందుకు ఓ ప్రధాన కారణం ఉంది. బ్రిటన్‌తో గత ఏడాది జులై నెలలో అమలులోకి వస్తుంది. దీంతో బ్రిటన్ నుంచి పూర్తిగా తయారై భారత్‌లోకి దిగుమతి అయ్యే వాహనాలపై సుంకాలు 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గుతాయి. ఈ కారణంగానే లగ్జరీ కార్ల ధరలు భారీగా దిగిరానున్నాయి. ఈ ప్రయోజనాన్ని తమ దేశీయ కొనుగోలు దారులకు బదిలీ చేసేందుకు టాటా గ్రూప్ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) సన్నద్ధమైంది. భారత్‌లో విక్రయించే తమ రేంజ్ రోవర్ ఎస్‌వీ మోడల్ కార్ల ధరలను భారీగా తగ్గించింది. సుంకాలు దాదాపు 80 శాతం వరకు తగ్గిన క్రమంలో ఆయా కార్లపై మోడల్‌ను బట్టి రూ.70 లక్షల నుంచి రూ.1.06 కోట్ల వరకు ధరలను తగ్గించనున్నారు. రూ.1 కోటి వరకు ధరలు తగ్గింపు ఈ ధరల క్షీణతకు ప్రధాన కారణం. గతంలో బ్రిటన్ నుంచి వచ్చే లగ్డరీ వాహనాలపై 110 శాతం ఉన్న దిగుమతి సుంకం కాస్తా ఈ ఒప్పందంతో 30 శాతానికి పడిపోనుంది. ఈ భారీ పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని దేశీయ కొనుగోలుదారులకు బదిలీ చేసేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. జేఎల్ఆర్ తన టాప్ ఎండ్ మోడల్ అయిన రేంజ్ రోవర్ ఎస్‌వీ (Range Rover SV) కార్ల ధరలపై మోడల్ ను బట్టి కోటి రూపాయల వరకు తగ్గించనుంది.ఏ మోడల్ ధర ఎంత, ఎంత తగ్గింది?రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ ప్రస్తుత ధర రూ.2.75 కోట్లు ఉంటే రూ.70 లక్షలు తగ్గి రూ.2.05 కోట్లకు దిగిరానుంది. రేంజ్ రోవర్ ఎస్‌వీ డీజిల్ కారు ధర రూ.3.83 కోట్లు ఉండగా రూ.96 లక్షలు తగ్గి రూ.2.87 కోట్లకు తగ్గనుంది. రేంజ్ రోవర్ ఎస్‌వీ పెట్రోల్ కారు ధర రూ.4.25 కోట్లు ఉండగా రూ.1.06 కోట్ల మేర తగ్గిం రూ.3.19 కోట్లకు తగ్గనుంది.ఒక సాధారణ ప్రారంబ స్థాయి కారు ధర సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటుంది. ఈ ఒక్క లగ్జరీ కారుపై తగ్గిన ధరతోనే ఏకంగా 10 కొత్త కార్లను కొనుగోలు చేయవచ్చు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జులై నెల నుంచే అమలులోకి రానుండడంతో రాబోయే రోజుల్లో బ్రిటన్ నుంచి వచ్చే మరికొన్ని ప్రీమియం బ్రాండ్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. విస్కీ, బ్రాందీ వంటి ఆల్కాహాల్ ధరలు సైతం భారీగా తగ్గనున్నాయి.