SIP + SWP ప్లాన్ మ్యాజిక్.. రూ.1000 పొదుపుతోనే రూ.1 కోటి.. ఆపై నెలకు రూ.1 లక్ష పెన్షన్!

Wait 5 sec.

Investment Plan: కోటీశ్వరులు కావాలంటే లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణ, సమయం, ప్రతి సంవత్సరం పెట్టుబడిని కొద్దిగా పెంచే అలవాటు ఉంటే కేవలం రూ.1000 ప్రారంభ పెట్టుబడితోనే రూ.1 కోటి నిధిని సాధించవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునే వారు కొంత రిస్క్ తీసుకుని మ్యూచువల్ ఫండ్స్‌వైపు వెళితే సరైన ఫండ్, స్థిర ఆదాయం పొందవచ్చని సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో లభించే ద్వారా రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.1 లక్ష స్థిరమైన ఆదాయం ఎలా పొందాలో తెలుసుకుందాం.రూ.1 కోటి నిధి సృష్టించడంమ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ద్వారా పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 28 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించినట్లియితే 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసు వరకు అంటే 32 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు నెలకు రూ.1000 చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్లడం ప్రారంభిస్తే స్టెప్ అప్ సిప్ ద్వారా ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున అంటే 2వ ఏడాదిలో నెలకు రూ.1100, ఆపైన రూ.1210 చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి. ఈ పెట్టుబడి వార్షిక రాబడి సగటున 12 శాతం చొప్పున వస్తుందని అంచనా వేస్తే మీరు పెట్టే పెట్టుబడి మొత్తం రూ.24,13,650 వరకు అవుతుంది. 32 ఏళ్ల తర్వాత చేతికి వచ్చే నిధి రూ.1.05 కోట్లు అవుతుంది. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఒక వేళ మీరు స్టెప్ అప్ చేయకుండా కేవలం రూ.1000 చొప్పున మాత్రమే 32 ఏళ్ల పాటు స్థిరంగా కడుతూ వెళ్తే మీకు కేవలం రూ.44 లక్షలు మాత్రమే వస్తాయి. కానీ మీ జీతం పెరిగే కొద్ది కేవలం రూ.10 శాతం పెట్టుబడిని పెంచుకుంటూ పోవడం వల్ల మీ నిధి ఏకంగా రూ.1.05 కోట్లకు చేరుతుంది. నెలకు రూ.1 లక్ష పెన్షన్విత్ డ్రాయల్ ప్లాన్ (SWP)లో చేరాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ నుంచి ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు పెన్షన్ మాదిరిగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవచాచు. మీ రూ.1 కోటి నిధిని సురక్షితమైన, హైబ్రిడ్ ఫండ్స్‌లోకి మార్చి దానిపై కన్జర్వేటివ్ గా 8-10 శాతం రిటర్న్స్ వస్తాయని అనుకుంటే మీ అసలు నిధి పెద్దగా తగ్గకుండానే మీరు ప్రతి నెల రూ.1 లక్ష చొప్పున దశాబ్దాల పాటు పెన్షన్ రూపంలో విత్ డ్రా చేసుకోవచ్చు.