1,70,00,000 మంది ITR ఫైల్ చేశారు.. మరి మీరు? లాస్ట్ డేట్ ఇదే.. మిస్సైతే భారీ పెనాల్టీలు తప్పవు!

Wait 5 sec.

ITR Filing Deadline: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సమయం సమీపిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2025-26 (అసెస్మెంట్ ఇయర్ 2026-27)కి సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు కొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఈ క్రమంలో ఐటీఆర్ ఫైలింగ్స్ గణనీయంగా పెరిగాయి. తమ రిటర్నులను విజయవంతంగా సమర్పించారు. మీరు ఇంకా ఫైల్ చేయకపోతే చివరి నిమిషంలో టెక్నికల్ ఇబ్బందులు పడకుండా ఇప్పుడే పూర్తి చేయడం మంచిది. ఎందుకుంటే గడువు దాటినట్లయితే భారీగా జరిమానాలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కరోజే 10 లక్షలుగత ఆర్థిక ఏడాదికి గాను ఇప్పటి వరకు 1.7 కోట్ల కుపైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలైనట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం వెల్లడించింది. అసెస్మెంట్ ఇయర్ 2026-27లో రిటర్నులు సమర్పించేందుకు గడువు తేదీ జులై 31,2026తో ముగుస్తుందని గుర్తు చేసింది. ఈ క్రమంలో గత శుక్రవారం ఒక్కరోజే 10 లక్షలకు పైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయని తెలిపింది. ట్యాక్స్ పేయర్లు కొత్త, పాత పద్ధతుల్లో, సరైన ఫారాల్లో తమ రిటర్నులు దాఖలు చేయవచ్చని సూచించింది. ఎవరికి ఏ లాస్ట్ డేట్?జీతభత్యాలు పొందే ఉద్యోగులు, పెన్షనర్లు ఐటీఆర్- 1, ఐటీఆర్- 2 ఫారం ఉపయోగించే వారికి జులై 31, 2026 తేదీ లాస్ట్ డేట్. ఇక చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు ఆడిటింగ్ అవసరం లేని వారు ఐటీఆర్- 3, ఐటీఆర్- 4 ఫైల్ చేసేందుకు గడువు ఆగస్టు 31, 2026 వరకు ఉంటుంది. ఇక తమ ఖాతాలు ట్యాక్స్ ఆడిట్ అవసరైన వారు ఐటీఆర్-3, ఐటీఆర్-5, ఐటీఆర్-6 ఫైల్ చేసేందుకు అక్టోబర్ 31, 2026 వరకు గడువు ఉంటుంది.గడువు దాటితే పెనాల్టీలుఒక వేళ మీరు జులై 31వ తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆ తర్వాత బిలేడెట్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. దీంతో సెక్షన్ 234ఎఫ్ కింద భారీగా జరిమానాలు విధిస్తారు. మీ వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే గడువు దాటినందుకు రూ.5000 పెనాల్టీ కట్టాలి. పన్ను బకాయిలపై వడ్డీ సైతం పడుతుంది. ఇక వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1000 జరిమానా పడుతుంది. ఆపైన సెక్షన్ 234ఏ ప్రకారం నెలకు 1 శాతం చొప్పున వడ్డీ పడుతుంది.