Kurnool: పెళ్లికి ముందే వైఫ్ రిలేషన్.. అత్త, భార్యను నరికి చంపిన భర్త.. ఉరిశిక్ష పడటంతో జైలులోనే ఆత్మహత్య!

Wait 5 sec.

పెళ్లికి ముందే భార్య మరో వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి తర్వాత ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్యని దూరం పెట్టాడు. అయితే, తనని మోసం చేసి పెళ్లి చేశారన్న కోపంతో అత్త, కట్టుకున్న భార్యను కిరాతకంగా నరికి చంపాడు. ఆ కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లిన వ్యక్తికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరి ఏమైందో ఏమోగానీ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరం అర్బన్ పరిధిలోని చింతమునినగర్‌కు చెందిన శ్రావణ్‌కుమార్ (30) రాజమండ్రి జైలులో ఆత్మహ్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులతో కలిసి భార్య రుక్మిణి, అత్త రమాదేవిలను హత్య చేశాడు. మామ వెంకటేశ్వర్లును కూడా చంపే ప్రయత్నం చేయగా ఆయన తప్పించుకుని పారిపోయాడు. 2023లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఆ కేసుకు సంబంధించి ఉరిశిక్ష ఖైదీగా ఉన్న శ్రావణ్ కుమార్ రాజమండ్రి జైలులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. READ ALSO వివరాల్లోకి వెళ్తే.. నంద్యాలకు చెందిన వరప్రసాద్, కృష్ణవేణి దంపతులు కర్నూలులోని కల్లూరు చింతమునినగర్‌లో స్ధిరపడ్డారు. వీళ్లకు ఒకే ఒక్క సంతానం శ్రావణ్ కుమార్. బీటెక్ చదివిన శ్రావణ్ కుమార్ హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేసేవాడు. 2023 మార్చి 1వ తేదీ తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన వెంకటేశ్వర్లు, రమాదేవిల కుమార్తె రుక్మిణితో వివాహం జరిగింది. పెళ్లికి ముందు నుంచే రుక్మిణి మరొకరిని ప్రేమిస్తోందని, పెళ్లి తర్వాత కూడా అతనితో మాట్లాడుతుందని తెలుసుకున్న శ్రావణ్ ఆమెను దూరంగా ఉంచాడు. దాంతో రుక్మిణి పుట్టింటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని శ్రావణ్ తన తల్లిదండ్రులకు చెప్పగా.. ముగ్గురు కలిసి రుక్మిణితో పాటు వాళ్ల తల్లిదండ్రులను కూడా హత్య చేయాలని ప్లాన్ చేశారు. పెళ్లి జరిగిన అదే నెలలో 14వ తేదీన శ్రావణ్ కుమార్ వనపర్తికి వెళ్లి తన భార్య, అత్తామామలను కర్నూలులోని ఇంటికి తీసుకొచ్చాడు. కొద్దిసేపు మాట్లాడినట్టు నటించి ఆ తర్వాత శ్రావణ్ కుమార్ కత్తితో తన భార్యను చంపగా, శ్రావణ్ కుమార్ తండ్రి వరప్రసాద్.. అమ్మాయి తల్లి రమాదేవిని కత్తితో పొడిచి చంపేశాడు. వెంకటేశ్వర్లును కూడా చంపే ప్రయత్నం చేయగా.. తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అమ్మాయి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు శ్రావణ్ కుమార్, వరప్రసాద్, కృష్ణవేణిపై హత్య, హత్యాయత్నం చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు వరప్రసాద్, శ్రావణ్ కుమార్‌కు ఉరిశిక్ష, కృష్ణవేణికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ కర్నూలు కోర్టు 2024 ఫిబ్రవరి 21న తీర్చు ఇచ్చింది. అప్పటి నుంచి రాజమండ్రి జైలులోనే వీళ్లందరూ ఉన్నారు. ఈ క్రమంలో శ్రావణ్ కుమార్ తాజాగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.