మీ పాన్ కార్డుపై ఉన్న ఆ 10 అక్షరాల అసలు అర్థం తెలుసా? మీ కార్డు అసలైందా కాదా అని ఇట్టే తెలుసుకోవచ్చు!

Wait 5 sec.

: ప్రస్తుత రోజుల్లో ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరా పాన్ కార్డు ఉంటోంది. ఈ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంటుంది. చాలా పనుల కోసం పాన్ కార్డు అవసరం పడుతుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఉద్యోగంలో చేరాలన్నా, ఐటీఆర్ దాఖలు చేయాలన్నా, ఉంటుంది. పాన్ కార్డులోనే 10 అంకెలు, అక్షరాలతో (ఆల్ఫాన్యూమరిక్) ఉండే కోడ్‌లో మీ ఆర్థిక సమాచారం అంతా దాగి ఉంటుంది. ఈ పదంకెల నంబరే మీరు చేసే అన్ని రకాల లావాదేవీల్లో అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ నంబర్ కేవలం ఆంగ్ల అక్షరాలు, నంబర్ల కలయిక మాత్రమే అనుకుంటే పొరబడ్డట్లే. దీని వెనుక ఒక పక్కా సిస్టమేటిక్ లెక్క ఉంది. మీ పాన్ కార్డ్ నంబర్‌లోని నాలుగో అక్షరం, ఐదో అక్షరం మీ గురించి ఎన్నో విషయాల్ని చెబుతాయి. అసలు మీ పాన్ కార్డులోని ఆ పది అక్షరాల వెనుక ఏమేం అర్థాలు ఉన్నాయి.. ప్రతి పాన్ కార్డులో నంబర్లు, అంకెలు దేనిని సూచిస్తాయి అనేది పూర్తిగా డీకోడ్ చేసి చూద్దాం. మొదటి 3 అక్షరాలు- పాన్ కార్డులోని మొదటి మూడు అక్షరాలు ఆంగ్ల వర్ణమాలలోని (ఆల్ఫాబెట్స్) AAA నుంచి ZZZ వరకు ఏదైనా కావొచ్చు. ఇవి సిస్టమ్ ద్వారా యాదృచ్ఛికంగా కేటాయిస్తారు.నాలుగో అక్షరం- ఇది అత్యంత కీలకం. ఈ కార్డు ఎవరికి చెందినది. దాని స్టేటస్ ఏంటి అనే దానిని సూచిస్తుంది. P- పర్సనల్ కార్డ్ఠC- కంపెనీ లేదా ట్రస్టులకు చెందిందిT- ట్రస్ట్F- ఫర్మ్L- లోకల్ అథారిటీ ఐదో అక్షరమే మీ గుర్తింపు- మీ పాన్ కార్డులోని ఐదో అక్షరం మీ ఇంటి పేరులోని (Surname) మొదటి అక్షరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు మీ ఇంటి పేరు నల్లా (Nalla) అయితే మీ పాన్ కార్డులోని ఐదో అక్షరం కచ్చితంగా N అని ఉంటుంది. ఆరు నుంచి తొమ్మిదో అక్షరాలు పూర్తిగా అంకెలు. ఇక్కడ 0001 నుంచి 9999 వరకు యాదృచ్ఛికంగా వచ్చే ఏవైనా నంబర్లు ఇక్కడ ఉంటాయి. ఇవి కూడా ఆటోమేటిక్‌గానే జెనరేట్ అవుతాయి. పదో అక్షరం మళ్లీ ఆల్ఫాబెట్- దీనిని చెక్ డిజిట్ అంటారు. మొదటి 9 అక్షరాల కలయికను బట్టి కంప్యూటర్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఒక ఆంగ్ల అక్షరాన్ని జనరేట్ చేసి ఇక్కడ ఇస్తుంది. అంటే ఇక్కడ తొలి 5 ఆల్ఫాబెట్స్ ఉంటే తర్వాతి 4 అంకెలు, చివరిది మళ్లీ అక్షరం ఉంటుందని తెలుసుకోవచ్చు. ఐదో అక్షరం మీ సర్ నేమ్‌లోని తొలి అక్షరం కాకపోతే ఆ కార్డు మీది కాదని ఇట్టే తెలుసుకోవచ్చు.