తరచూ వయనాడ్‌లో ఎందుకీ విపత్తులు? ప్రకృతి శాపమా? భౌగోళిక బలహీనతలా?

Wait 5 sec.

సరిగ్గా రెండేళ్ల కిందట ప్రకృతి విలయతాండవానికి వయనాడ్‌ చిగురుటాకులా వణికిపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన ఈ విధ్వంసం.. గ్రామాలకు తుడిచిపెట్టేసింది. తాజాగా,అయితే, గత కొన్ని దశాబ్దాలుగా వాయనాడ్‌ జిల్లా ఇటువంటి ప్రాణాంతక విపత్తులను ఎదుర్కొంటోంది. కేరళలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా వయనాడ్ గుర్తింపు పొందింది. వయనాడ్‌కు కొండచరియలు ఘటనల సుదీర్ఘ చరిత్ర ఉంది. రెండేళ్ల కిందట 2024 జులై 30న సంభవించిన ఘోర విపత్తులో ఏకంగా 298 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 1984లో ముండక్కై‌లో 14 మంది, 1992లో కప్పీక్కలాం ఘటనలో 11 మంది, 2007లో వలంథోడ్‌లో నలుగురు మరణించారు.పశ్చిమ కనుమలలో ఉన్న వయనాడ్-మలప్పురం- కోజికోడ్ సరిహద్దుల్లోని కొండ ప్రాంతాలు తీవ్రమైన ముప్పులో ఉన్నాయి. కేరళంలో దాదాపు 17,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఈ ప్రమాదం పరిధిలో ఉంది. అందుకే దక్కన్ పీఠభూమి దక్షిణ కొనలో ఉన్న, వాస్తవానికి, కేరళ మొత్తంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉన్న జిల్లాగా వయనాడ్‌ను అనేక పరిశోధనలు గుర్తించాయి. ఈ జిల్లా భూకంపాల జోన్ III పరిధిలోకి వస్తుంది.. అంటే వయనాడ్ మధ్యస్థ భూకంప ముప్పును ఎదుర్కొంటోంది.సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ (CESS) నిపుణులు ప్రకారం.. వయనాడ్, మలప్పురం, కోజికోడ్‌లకు సరిహద్దులుగా ఉన్న కొండ ప్రాంతాలను అత్యంత సున్నితమైన, విపత్తులకు గురయ్యేవిగా గుర్తించారు. 2011 మాధవ్ గాడ్గిల్ కమిటీ నివేదిక హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి ఉంటే, విధ్వంసం ప్రభావం చాలా వరకు తగ్గేది. ఆ నివేదిక పశ్చిమ కనుమలలోని చాలా భాగాలను అత్యంత సున్నితమైనవిగా స్పష్టంగా వర్గీకరించి.. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, క్వారీయింగ్‌ చేపట్టవద్దని హెచ్చరించింది. దురదృష్టవశాత్తూ ఈ నివేదిక హెచ్చరికలను చాలా వరకు విస్మరించారు. అదే ఇప్పటికీ ప్రాణనష్టానికి కారణమవుతూనే ఉంది.కేరళంలో 2018 నాటి వరదలు విధ్వంసమే ఆ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విపత్తు... అప్పుడు ఏకంగా 483 మంది మరణించారు. ఈ స్థాయిలో ప్రకృతి విపత్తుకు కారణం అరేబియా సముద్ర జలాలు వేడెక్కడమేని అప్పట్లో అభిప్రాయం వ్యక్తమయ్యాయి. కేరళంలోని 14.5 శాతం భూభాగంలో భారీ వర్షాలు, వరదల సంభవించే అవకాశం ఉంది. పర్యావరణ మార్పులు, అడవులు, చెట్లు నరికివేత వంటివి వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే ఘటనలకు ప్రధాన కారణమనేది నిపుణుల అంచనా. నిర్మాణ రంగ కార్యకలాపాలూ కూడా విపత్తులకు కారణమని విశ్లేషిస్తున్నారు.2021 అక్టోబరులో ఇడుక్కి, కొట్టయాం జిల్లాలో భారీ వర్షాలకు 35 మంది, ఆగస్టు 2022లో భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 18 మంది మృతిచెందారు. దేశంలో 2005- 2022 మధ్య మొత్తం 3,782 కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకోగా.. అత్యధికంగా కేరళలో 2,239 ఉన్నట్టు కేంద్ర భూవిజ్ఞాన శాఖ ఓ నివేదికలో పేర్కొంది. కాగా, ప్రపంచంలోనే కొండచరియలు ఎక్కువగా విరిగిపడే మొదటి ఐదు దేశాల్లో భారత్ ఒకటి. దేశంలోని మొత్తం భూభాగంలో దాదాపు 12.6% (0.42 మిలియన్ చదరపు కిలోమీటర్లు) ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రమాదంలో ఉంది.