టీమిండియా హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..!

Wait 5 sec.

టీమిండియా టీ20 జట్టు త్వరలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకోసం భారత సెలక్షన్ కమిటీ.. అయితే ఈ టీమ్‌తో పాటు వెళ్లే కోచింగ్ స్టాఫ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. జింబాబ్వే పర్యటనకు ప్రస్తుత ప్రధాన కోచ్ వెళ్లడం లేదట. గంభీర్‌ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ చీఫ్‌గా ఉన్న తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు వహించనున్నాడని సమాచారం.భారత క్రికెట్ జట్టు రాబోయే రోజుల్లో వరుస అంతర్జాతీయ సిరీస్‌లతో బిజీగా ఉండనుంది. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ 2027కు సన్నద్ధం అవడంలో భాగంగా.. ప్రణాళికలు రచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గంభీర్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అతడితో పాటు ఇతర కోచింగ్ సిబ్బంది కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లరని సమాచారం. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. టీ20 సిరీస్ ఆడుతోంది. ఇది పూర్తయిన తర్వాత వన్డే సిరీస్ ఉంటుంది. ఈ నేపథ్యంలో గంభీర్‌కు విశ్రాంతినిస్తూ, పనిభారాన్ని తగ్గించేందుకు గానూ ఈ పర్యటన బాధ్యతలను లక్ష్మణ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.జింబాబ్వే పర్యటనతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026లో కూడా భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్‌ హెడ్‌కోచ్‌గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఏషియన్ గేమ్స్ సమయంలో భారత సీనియర్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. రెండు సిరీస్‌లు ఒకేసారి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జులై 23, 25, 26 తేదీల్లో భారత్, జింబాబ్వే మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.జింబాబ్వే పర్యటనకు భారత టీ20 జట్టు ఇదే..శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), శివమ్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్‌)