సాయికృష్ణకు వైద్యం చేసిన ఆర్ఎంపీ అజ్ఞాతంలోకి..? కేసులో కీలక మలుపు ఇదే, అతను దొరికితే అంతా బయటకు!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసులో అయితే, ఈ కేసులో కీలక సాక్షి అయిన ఆర్ఎంపీని మరోసారి విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఆర్ఎంపీని ఎవరు స్టేషన్‌కు రప్పించారు? అన్న కోణంలో పోలీసులు మళ్లీ దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే, ఐదు రోజులుగా ఆర్ఎంపీ క్లీనిక్ తెరవడం లేదని, అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్ఎంపీ వైద్యం చేశారని తెలుస్తున్న ఈ కేసులో, అతను స్టేషన్‌కి వచ్చేసరికి సాయికృష్ణ పరిస్థితి ఎలా ఉంది? వైద్యం చేసిన తర్వాత ఎలా ఉన్నాడు? అప్పటికే మరణించాడా? ఇలా పలు కోణాల్లో పోలీసులు ఆర్ఎంపీని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆర్ఎంపీ పోలీసుల ముందు హాజరైతే అసలు విషయం అంతా బయటకు వస్తుంది. ఇక ఈ కేసులో అరెస్టయిన సీఐ నాగరాజును సిట్ అధికారులు ఎనిమిది రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు. సాయికృష్ణ మృతిలో నాగరాజు నోరువిప్పితేనే ఏం జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అరెస్టయిన తర్వాత ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధింది నోరు విప్పలేదు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ నుంచి మళ్లీ కస్టడీలోకి వచ్చిన సీఐ ఈసారి అయినా నోరు విప్పి అసలు నిజాలు బయటపెడతాడా? అన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిట్ అధికారులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనుండటంతో కచ్చితంగా నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు.రాజమండ్రి జైలులోనే నిందితుడు సీఐ నాగరాజును విచారించాలని విజయవాడ కింది కోర్టు తొలుత ఉత్తర్వులిచ్చింది. సిట్ దీన్ని హైకోర్టులో సవాలు చేయగా, స్టేషన్‌లోనే విచారించేందుకు ఆదేశాలు వచ్చాయి. కేసులో కీలక ఆధారాలు రాబట్టేందుకు స్టేషన్‌లోనే విచారించాలని సిట్ భావిస్తోంది. అదేవిధంగా నాగరాజును కస్టడీకి తీసుకున్న అనంతరం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నట్లు కూడా సిట్ అధికారులు తెలిపారు. కృష్ణలంక స్టేషన్‌లో సిబ్బందిని విడతలవారీగా సిట్ విచారిస్తున్నా ఇప్పటి వరకు సమాధానాలు రాలేదు. అసలు సాయికృష్ణ ఎలా మరణించాడు? శవాన్ని ఏం చేశారు అన్నది మిస్టరీగానే మిగిలిపోతోంది. కృష్ణలంక స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లు చెన్నయ్య, సత్యనారాయణ, కానిస్టేబుల్ బాబు, కో రైటర్ వీరాంజనేయులు, రైటర్ రాజేశ్ పోలీస్ గెస్ట్ హౌస్‌లో సిట్ ఎదుట హాజరయ్యారు. మే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆ మూడో రోజుల్లో డ్యూటీలో ఉన్న వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. సాయికృష్ణ స్టేషన్‌కు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎలా మరణించాడు? మరణించిన తర్వాత శవాన్ని ఏం చేశారు? అన్న ప్రశ్నలపైనే సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి తీసుకోవడంతో ఈ కేసులో చిక్కుముడి వీడే అవకాశం ఉందని సిట్ బృందం భావిస్తోంది.