ఏపీలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు.. ఇకపై సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లకుండానే పనులు పూర్తి!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక అడుగు వేయనుంది. మహారాష్ట్రలో అమలవుతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏపీలోనూ ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ విధానం అమలయితే ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయకు పదేపదే వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీని తగ్గించి మెరుగైన సేవలను త్వరగా అందించే లక్ష్యంతోనే ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రభుత్వం తీసుకొస్తోంది. క్షేత్ర స్థాయిలో ఇది అమలయితే ప్రజలు నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లకుండానే రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సేవలు ఒకే చోట పొందొచ్చు. ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే రిజిస్ట్రేషన్ సేవలను గ్రామాలు, పట్టణాల దగ్గరికి తీసుకెళ్లడమే. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ తగ్గించి.. పారదర్శకంగా, చాలా వేగంగా సేవలు అందించడం. ఈ విధానం అమలయితే ప్రజలకు ప్రయాణ సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. READ ALSO రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలయ్యే అన్ని సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఆస్తి రిజిస్ట్రేషన్ సేవలు, అమ్మకపు ఒప్పందాల పరిశీలన, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాల తనిఖీ, డాక్యుమెంట్ల స్కానింగ్, అప్‌లోడ్, అపాయింట్‌మెంట్ బుకింగ్, ఈ కేవైసీ, స్టాంప్ డ్యూటీ లెక్కింపు, రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు, మార్కెట్ విలువ సమాచారం. ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్), సర్టిఫైడ్ కాపీలు, రిజిస్ట్రేషన్ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఈ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. READ ALSO ఈ విధానం అమలయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. భూములు, ఇళ్లు కొనుగోలు చేసేవారికి ఈ సేవా కేంద్రాలతో ఉపయోగం ఉంటుంది. రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వృద్ధులు, మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అయితే, పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ మాత్రం ఈ సేవా కేంద్రాల్లో జరగదు. తుది రిజిస్ట్రేషన్‌ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సిందే. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందు జరిగేవన్నీ ఈ సేవా కేంద్రాల్లోనే పూర్తయితాయి. ఈ కేంద్రాలకు ప్రభుత్వం ఎలాంటి సేవలు అందిస్తుంది అనేది త్వరలోనే తెలియనుంది. మొత్తానికి ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం అవ్వడం ఖాయమనే చెప్పొచ్చు.