కూటమి ధర్మాన్ని పాటించాల్సిందే.. వాళ్లను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే: మాజీ మంత్రి బాలినేని

Wait 5 sec.

మాజీ మంత్రి, నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా కూటమి ధర్మాన్ని పాటించాలి అంటున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీచేసే స్థానాల్లో టీడీపీ నుంచి ఎవరైనా ఇండిపెండెంట్‌గా నామినేషన్లు దాఖలు చేస్తే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. జనసేన పార్టీ పోటీచేసే స్థానాల్లో ఎవరైనా నామినేషన్లు దాఖలు చేస్తే సస్పెండ్ చేస్తామని టీడీపీ ముందుగానే ప్రకటించాలన్నారు. అప్పుడు క్రమశిక్షణ ఉంటుందని.. అదే కూటమికి కరెక్ట్ అన్నారు. 'మనం పోటీచేసి, డబ్బు ఖర్చు పెట్టుకుని, పరువు పోతే ఎలా' అంటూ బాలినేని వ్యాఖ్యానించారు. ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన నియోజకవర్గం జనసేన పార్టీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉన్న జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించామన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. వాటిని పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు పంపిస్తామన్నారు. జనసేన పార్టీ కోసం నిజాయతీగా, నిబద్ధతతో కష్టపడే వారికే పారదర్శకంగా పదవులు కేటాయిస్తామన్నారు. జనసేన పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.నరసరావుపేట పార్లమెంటు జనసేన పార్టీ పరిశీలకుడిగా నియమించిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియను నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో ఆక్ష్న ప్రారంభించారు. నియోజకవర్గంలో 7 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిధి నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత దరఖాస్తులు సమర్పించారు. పదవుల కోసం సమర్పించిన అన్ని దరఖాస్తులను పార్టీ నాయకత్వం త్వరలోనే క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.