HDFC MCLR Rate: అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్లకు సడెన్ ఝలక్ ఇచ్చింది. వివిధ రుణాలకు లింక్ అయి ఉండే మార్జినకల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్) ఎంపిక చేసిన టెన్యూర్లపై 5 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్లు ప్రకటించింది. వీటికి లింక్ అయి ఉన్న రుణాలు తీసుకున్న వారికి ఇది మంచి వార్తగా చెప్పవచ్చు. మరోవైపు, సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లను జులై 7, 2026 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది.వడ్డీ రేట్ల సవరణ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ రేటు 8.05 శాతం నుంచి 8.70 శాతం మధ్య ఉంది. ఇది లోన్ టెన్యూర్ బట్టి మారుతుంటుంది. ఇంతకు ముందు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.10 శాతం నుంచి 8.55 శాతం మధ్య ఉండగా తాజాగా 5 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో హోమ్ లోన్, కారు లోన్ వంటి రిటైల్ రుణాలు తీసుకున్నవారిపై అదనపు భారం పడనుంది. వారు చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐల భారం కొంత మేర పెరగనుంది.లేటెస్ట్ హెచ్‌డీఎఫ్‌సీ లెండింగ్ రేట్లు1 నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.05 శాతం వద్ద స్థిరంగా ఉంది. 3 నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.20 శాతం వద్ద స్థిరంగా ఉంచారు. 6 నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.35 శాతం వద్ద ఎలాంటి మార్పు చేయలేదు. 1 సంవత్సరం కీ బెంచ్ మార్క్ రేటును 8.40 శాతం నుంచి 8.45 శాతానికి పెంచారు. 2 సంవత్సరాల ఎంసీఎల్ఆర్ రేటు 8.55 శాతం వద్ద స్థిరంగా ఉంది. 3 సంవత్సరాల ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతం నుంచి 8.70 శాతానికి పెంచారు.పెరగనున్న ఈఎంఐల భారంహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్ల సవరణతో రుణ గ్రహీతలపై ప్రభావం పడనుంది. సాధారణంగా రిటైల్ లోన్స్ అన్నీ 1 ఏడాది ఎంసీఎల్ఆర్ రేటుకు లింక్ అయి ఉంటాయి. ఈ రేటు 8.40 శాతం నుంచి 8.45 శాతానికి పెరగడం వల్ల హోమ్ లోన్, ఆటో లోన్ తీసుకున్న వారి ఈఎంఐలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇక మూడేళ్ల కాలపరిమితి గల పెద్ద వ్యాపార రుణాలు తీసుకున్న వారిపైనా 5 బేసిస్ పాయింట్ల అదనపు భారం పడవచ్చు. ఓవర్ నైట్ రేటు తగ్గడం వల్ల అతి స్వల్ప కాలిక మైక్రో బిజినెస్ లోన్లు తీసుకునే వారికి కొంత ఉపశమనం లభించనుంది. గమనిక: ఈ వడ్డీ రేట్ల పెంపు అనేది పాత రుణ గ్రహీతలకు వెంటనే వర్తించదు. మీ లోన్ అగ్రిమెంట్ లో ఉన్న రీసెట్ డేట్ వచ్చిన రోజున మాత్రమే ఈ కొత్త వడ్డీ రేట్లు మీ ఈఎంఐపై ప్రభావం చూపిస్తాయి. అలాగే కొత్తగా రుణాలు తీసుకునే వారికి ఈ కొత్త వడ్డీ రేట్ల ప్రకారమే రుణాలు మంజూరు చేస్తుంటారు.