ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై నటుడు సీనియర్ విజయ కృష్ణ వరుస ట్వీట్‌లు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఆయన ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభతో పాటుగా జైభీమ్ పార్టీ అధినేత, లాయర్ జడ శ్రవణ్ కుమార్‌‌పై ఓ ట్వీట్ చేశారు. అలాగే ఏలూరు సభలో ప్రసంగాలు, ఆ తర్వాత నమోదైన కేసులు, అరెస్ట్‌లు అంటూ స్పందించారు. నటుడు నరేష్ పరోక్షంగా ప్రశ్న రావణ్ అరెస్ట్‌ సహా అన్ని అంశాలను ప్రస్తావించారు. ఈ పరిణామాలన్నీ ఓట్ల కోసం జరుగుతున్న ఓ రాజకీయ వ్యూహంగా ఆయన చెప్పుకొచ్చారు. నరేష్ తాజాగా మరోసారి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. నరేష్ ఈ నెల 1న చేసిన ట్వీట్‌ను గుర్తు చేస్తూ.. 'ఐదు రోజుల క్రితం నేను ఈ ట్వీట్ చేసినప్పుడు, తమిళనాడు ఎన్నికలపై నా అంచనాలాగే ప్రజలు నన్ను తేలికగా తీసుకున్నారు. ఈ రోజు ఈ విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని వెనుక మత, రాజకీయ కుట్ర ఉందని నేను స్పష్టంగా చెప్పాను. గుండెపోటుకు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీలు, ఇతరులు.. ప్రశ్న, జడ శ్రవణ్ అండ్ టీమ్‌కు పూర్తి మద్దతుగా ముందుకు వచ్చారు. నేను ఏ పార్టీ మద్దతు తెలియజేయడం లేదు.. కానీ ఈ పరిణామాలను అధ్యయనం చేస్తున్న ఒక రాజకీయ పరిశీలకుడిని మాత్రమే. ఇప్పటికైనా మేల్కొనండి.. రాష్ట్రం మాత్రమే కాదు, దేశం మొత్తం ఈ పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. వెయిట్ అండ్ సీ.. ఊరికే చెబుతున్నాను' అంటూ నరేష్ ట్వీట్ చేశారు.లో.. 'జైభీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ అండ్ టీమ్ తీవ్రమైన మత, రాజకీయ ప్రచారం.. ఆ తర్వాత నమోదైన ఎఫ్ఐఆర్‌లు, అరెస్టులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే అధికారి కూటమిని సవాల్ చేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్రైస్తవ, దళిత ఓట్లను ఆశించేందుకు మరో రాజకీయ పార్టీతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాన్ని మార్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఇది ఒక గుండెపోటుకు ముందుగా వచ్చే హెచ్చరిక వంటిది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, రాబోయే ఎన్నికలు సిద్ధాంతాలకు, ధర్మానికి మధ్య పోరుగా.. రాజకీయ రంగంలో ఒక కలియుగ మహాభారతంగా మారే అవకాశం ఉంది. గతంలో నేను చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. ఈ అంశాలను గమనిస్తూ ఉండండి' అంటూ నరేష్ ట్వీట్ చేశారు. సీనియర్ నటుడు నరేష్ ఇటీవల కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిణామాలపై స్పందిస్తున్నారు.. తన అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు. ఇటీవల ఆయన ఇడుపు కాయితం సినిమా అంశంపై స్పందించారు.. అలాగే రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్, డెలివరీ బాయ్ వివాదంపై తన అభిప్రాయాలను చెప్పారు. ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిణామాలపై వరుసగా ట్వీట్‌లు చేస్తున్నారు. నరేష్ ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయపరమైన అంశాలపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది.