విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో వ్యక్తి అదృశ్యం! అసలు ఏం జరిగిందంటే?

Wait 5 sec.

విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ పరిధిలోఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ధ్రువీకరిస్తున్నా.. అతని మృతదేహం ఏమైందనేదీ ఇప్పటికీ అంతుచిక్కని ఓ మిస్టరీ. ఈ కేసులో సీఐ నాగరాజు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, మరో వ్యక్తిని పోలీసులు నిందితులుగా చేర్చారు. కూడా తరలించారు. అయితే సాయికృష్ణ కేసు వ్యవహారం ముగియకముందే.. పరిధిలో మరో వ్యక్తి అదృశ్యమయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ కేసు విచారణలో భాగంగా మొగిలిచర్ల ఏసుబాబు అనే వ్యక్తిని జగ్గయ్యపేట పోలీసులు జూన్ 17వ తేదీ తీసుకెళ్లారని.. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏసుబాబు ఆచూకీ తెలియలేదనే వార్తలు సోషల్ మీడియాలో, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ప్రసారమయ్యాయి. అలాగే విచారణ పేరుతో జగ్గయ్యపేట పోలీసులు ఏసుబాబు భార్యను, అత్తను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఏసుబాబు ఆచూకీ లేకపోవటంతో అతని మేనమామ శివయ్య హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందించింది. విజయవాడ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మరో వ్యక్తి అదృశ్యమయ్యాడనే వార్తలలో నిజం లేదని.. ఇదంతా కొంతమంది పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంగా ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం వెల్లడించింది. మొగిలిచర్ల ఏసుబాబును మూడు రోజుల క్రితం జగ్గయ్యపేట పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపింది. చట్ట ప్రకారం ఏసుబాబును అరెస్టు అయిన 24 గంటలలో జగ్గయ్యపేట పోలీసులు అతన్ని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారని వెల్లడించింది. న్యాయమూర్తి రిమాండ్ విధించటంతో ఏసుబాబును జగ్గయ్యపేట సబ్ జైలుకు తరలించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో వ్యక్తి అదృశ్యమనే వార్తను నమ్మవద్దని కోరింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిమీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.