Microsoft Layoffs: మల్టీనేషనల్ టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ కంపెనీలో మరోసారి వేలాది మందిని తొలగించే ప్రక్రియ ఇప్పుటు టెక్ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్ (Xbox) లో ఇప్పటికే 1600 ని కంపెనీ నుంచి పంపించేసినట్లు చెప్పారు. ఈ లేఆఫ్స్ జూనియర్ ఉద్యోగులకే పరిమితం కాలేదు. 37 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఎంతో నమ్మకంగా పని చేస్తున్న కెవిన్ లాచాపెల్ పేరు సైతం ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఎక్స్ బాక్స్ సంస్థ వైస్‌ప్రెసిడెండ్ స్థానంలో ఉన్నారు. అలాంటి ఆయనకే లేఆఫ్స్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని లింక్డిన్ వేదికగా షేర్ చేస్తూ ఉద్వేగానికి గురయ్యారు.'ఎక్స్‌బాక్స్ లేఆఫ్స్ లిస్టులో నా పేరు సైతం ఉంది. మైక్రోసాఫ్ట్‌తు నాకు ఉన్న 37 ఏళ్ల అనుబంధానికి ఇది ముగింపు. నా ప్రయాణంలో ఎక్స్ బాక్స్ బ్యాక్‌వర్డ్ కంపాటబిలిటీ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేసిన ఇంజినీర్ల టీంకు నేను నాయకత్వం వహించిన జ్ఞాపకాలు ఎంతో విలువైనవి. ఎక్స్‌బాక్స్ జర్నీ మరింత అభివృద్ధితో సాగేలా ఉండాలని, ఆ జర్నీని చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను' అంటూ పేర్కొన్నారు ఎక్స్‌బాక్స్ వైస్‌ప్రెసిడెంట్ కెవిన్ లాచాపెల్. తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కెవిన్ లాచాపెల్ 1989 లో మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పని చేశారు. గేమింగ్ విభాగమైన ఎక్స్ బాక్సులో చేరి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు లేఆఫ్స్‌లో భాగంగా కంపెనీని వీడాల్సి వచ్చింది. 37 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఇది ముగింపు అంటూ భావోద్వేగానికి గురయ్యారు కెవిన్. ప్రస్తుత పరిస్థితులు సాధారణ ఉద్యోగులకే కాకుండా పైస్థాయి వారికి సైతం ప్రమాదకరమేనని ఈ సంఘటనే ఉదాహరణ. ఎక్స్‌బాక్స్ లేఆఫ్స్ఇందులో భాగంగా గత సోమవారం ఒక్కరోజే 1600 మందిని తొలగించినట్లు ప్రకటించింది. 2026- 27 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మిగిలిన వారిని కంపెనీ నుంచి తొలగిస్తామని తెలిపింది. ప్రస్తుతం తమ వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు కంపెనీ సీఈఓ ఆశా శర్మ తన ఇ-మెయిల్ లేఖలో పేర్కొన్నారు. తాజాగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ చర్చకు దారితీసింది.