: దేశవ్యాప్తంగా (OPS) పునరుద్ధరించాలని ఉద్యోగాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కేటగిరీలోని ఉద్యోగులకు పెద్ద ఊరట కల్పించింది. ఉద్యోగంలో చేరిన నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2004న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అమలులోకి వచ్చినప్పటికీ అంత కంటే ముందే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన నిర్దిష్ట ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ఎంచుకునే వన్-టైమ్ ఆప్షన్ తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ తాజాగా ప్రసిద్ధ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయిన సీఎస్ఐఆర్ కూడా మెమోరండం జారీ చేసింది. అయితే, ఈ అదనపు ప్రయోజనం అందరు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. కేవలం ప్రత్యేక కేటగిరీకి చెందిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే కారుణ్య నియామక ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. అలాగే ఎవరైతే డిసెంబర్ 12, 2003 లేదా అంత కంటే ముందే కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకుని, కొన్ని కారణాల వల్ల జనవరి 1, 2004 తర్వాత సర్వీసులో చేరాల్సి వచ్చిందో వారికి ఈ అవకాశం దక్కుతుంది. అలాగే గతంలో వీరికి నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలోనే పెన్షన్ ఇచ్చేవరాు. కానీ కేంద్రం పెన్షన్ శాఖ జూన్ 22, 2026 రోజున ఇచ్చిన లేఖ ఆధారంగా సీఎస్ఐఆర్ జులై 7, 2026న తమ ల్యాబ్, ఇన్‌స్టిట్యూట్లలోని కారుణ్య ఉద్యోగులకు సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021 లేదా ఓపీఎస్ ఎంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా ఉద్యోగంలో చేరిన తేదీ ఆధారంగా పెన్షన్ నిర్ణయిస్తారు. కానీ, ఈ ప్రత్యేక నిర్ణయం ప్రకారం ఉద్యోగంలో చేరిన డేట్‌తో సంబంధం లేకుండా, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న డేట్ ప్రకారం పాత పెన్షన్ ఎంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. కేంద్రం 2004, జనవరి 1 నుంచి జాతీయ పింఛన్ పథకం అమలు చేసినందున ఆ తేదీ నుంచి ఉద్యోగంలో చేరిన వారికి ఎన్‌పీఎస్ వర్తిస్తుంది. అయితే, తాజా ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తు 2003 డిసెంబర్ లోపే ఉంటే అపాయింట్మెంట్ 2004 తర్వాత వచ్చినా ఓపీఎస్ ఎంచుకునేందుకు అర్హత లభిస్తుంది. అప్పుడు ఉద్యోగంలో చేరిన సమయంలో కారుణ్య నియామకాల కింద వచ్చిన వారికి ఈ బెనిఫిట్ ఇవ్వలేదు. అయితే, తాజాగా పాత పెన్షన్ అవకాశం ఇవ్వడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. మిగతా సీఏబీల ఉద్యోగులకు వర్తిస్తుందా? ఒకేసారి వర్తించదు. అయితే, సీఎస్ఐఆర్ వంటి పెద్ద సంస్థలు ఈ నిర్ణయాన్ని అమలు చేయడం ప్రారంభించిన క్రమంలో మిగిలిన కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థలు సైతం ఒకదాని తర్వాత ఒకటి ఈ కేంద్రం నిర్ణయాన్ని స్వీకరించి, తమ వద్ద ఉన్న అర్హులైన ఉద్యోగులకు ఓపీఎస్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది.