రైతులకు అదిరిపోయే న్యూస్.. ఒకేసారి 3-4 పంటల సాగు, లక్ష రూపాయల వరకూ సబ్సిడీ!

Wait 5 sec.

వ్యవసాయం కూడా కాస్త తెలివిగా చేస్తే కాసుల పంట కురవడం ఖాయం. అందుకోసం ప్రభుత్వం కూడా తమ వంతు ప్రయత్నం చేస్తుంటుంది. ముఖ్యంగా ఉద్యానవన పంటలు సాగు చేసే రైతుల కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు నూతన విధానాలతో పాటు ప్రోత్సహకాలను కూడా అందిస్తోంది. కాయగూరల పండించే రైతులకు ప్రభుత్వం శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సాహాలు ప్రకటించింది. ఒకేసారి 3 - 4 పంటలు సాగు చేసుకుని మంచి ఆదాయాలు పొందేలా ప్లాన్ కూడా ఇచ్చింది. ఒక ఎకరా పొలంలో ఒకేసారి 3 - 4 పంటలు వేసుకోవచ్చు. కూరగాయలు పండించే రైతులకు ఇది మంచి అవకాశం. పొలంలో శాశ్వత పందిర్లు ఏర్పాటు చేసుకుని మెరుగైన ఉపాధి అవకాశాలు పొందొచ్చని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పందిరిపై తీగజాతి పంటలతో పాటు స్తంభాల మధ్య భాగంలో రెండుచోట్ల మరో మూడు రకాల పంటలు సాగు చేసేలా ఉద్యానశాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. READ ALSO పందిరి ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేసుకునే రైతుల కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. సాధారణంగా ఎకరా పొలంలో శాశ్వత పందిర్లు వేయాలంటే రూ. 2 లక్షల ఖర్చు కాగా, ప్రభుత్వం 50 శాతం రాయితీ అంటే రూ. లక్ష వరకూ ప్రోత్సాహం ఇస్తుంది. దీంతో మెరుగైన ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. వరితో పాటు ఎక్కువ కాలం సాగు చేసే పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి చూపాలని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావడమే కాకుండా.. కొద్దిపాటి విస్తీర్ణంలోనే ఎక్కువ మొత్తంలో సాగు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఒకే రకం కాకుండా ఒకేసారి ఎక్కువ రకాల పంటలు వేసుకోవచ్చు. ఒక ఎకరాలో 185 స్తంభాలు ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. పందిరిపై బీర, కాకార, సొరకాయ, దొండ తదితర పంటలు వేసుకోవచ్చు. కింది భాగంలో పూలసాగుతో పాటు వంగ, బెండ, క్యాప్సికం, క్యారెట్ సాగు చేసుకోవచ్చని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి ఉన్న రైతులు దగ్గరలోని ఉద్యానశాఖ అధికారుల వద్దకు వెళ్లి 50 శాతం రాయితీతో ఈ పందిరి సాగును మొదలుపెట్టండి.