రూ. 15, 20, 25 లక్షల జీతం.. పాత vs కొత్త పన్ను విధానంలో దేంట్లో టాక్స్ ఎంత పడుతుంది? లెక్కలివే

Wait 5 sec.

: వేతన జీవులకు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు పాత పన్ను విధానం ఎంచుకోవాలా లేదా కొత్త పన్ను విధానానికి మొగ్గుచూపాలా? అనేది అత్యంత కీలకమైన నిర్ణయం. కొత్త పన్ను విధానం తక్కువ శ్లాబు రేట్లతో డిఫాల్ట్ ఆప్షన్‌గా మారినప్పటికీ, పాత పన్ను విధానంలో లభించే మినహాయింపులు పన్ను భారాన్ని తగ్గిస్తాయి. మరి ఇప్పుడు వార్షిక ఆదాయం రూ. 15 లక్షలు, ఇంకా రూ. 20, 25 లక్షలు ఉన్న వారు ఏ విధానంలో ఎక్కువ పన్ను ఆదా చేసుకోవచ్చు. గ్రాంట్ థార్న్‌టన్ విశ్లేషణ ప్రకారం ఏ పన్ను విధానంలో ఎంత ఆదాయంపై టాక్స్ పడుతుంది. మినహాయింపులు పాత దాంట్లో ఉన్నా దేంట్లో పన్ను ఎలా పడుతుందనేది తెలుసుకుందాం. ఇక్కడ గ్రాంట్ థార్న్‌టన్ భారత్ పార్ట్‌నర్ అండ్ గ్లోబల్ పీపుల్ సొల్యూషన్స్ లీడర్ అఖిల్ చంద్రా టాక్స్ లెక్కల్ని వివరించారు. ఇక్కడ ఆయన తీసుకున్న అంచనాలు చూద్దాం. పాత పన్ను విధానంలో ఆయన ప్రకారం గరిష్ఠంగా రూ. 4.75 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందొచ్చు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలు, సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షలు, అదనపు NPS (సెక్షన్ 80CCD (1B)) రూ. 50 వేలు, హెల్త్ ఇన్సూరెన్స్ సెక్షన్ 80D రూ. 25 వేలు, HRA మినహాయింపులు రూ. 2 లక్షలు) గా తీసుకున్నారు. ఇదే కొత్త పన్ను విధానంలో చూస్తే వేతన జీవులకు రూ. 75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే ఉంది. ఇక్కడ సెక్షన్ 80C, 80D, HRA వంటివి ఉండవు.Read Also: రూ. 15 లక్షల జీతంపై చూస్తే పాత పన్ను విధానం ప్రకారం పాత పన్ను విధానంలో మినహాయింపులు అన్నీ తీసేస్తే రూ. 1,24,800 పన్ను పడితే (4 శాతం హెల్త్ ఎడ్యుకేషన్ సెస్ కలిపి), అదే కొత్త పన్ను విధానంలో రూ. 97500 పడుతుంది. ఇక్కడ కొత్త పన్ను విధానంలో రూ. 27300 వరకు ఆదా అవుతుంది. రూ. 20 లక్షల ప్యాకేజీపై చూస్తే పాత పన్ను విధానంలో టాక్స్ రూ. 2,80,800 పడితే కొత్త దాంట్లో ఇది రూ. 1,92,400 గా ఉంటుంది. ఇక్కడ కొత్త పన్ను విధానంలోనే రూ. 88,400 ఆదా అవుతుంది. రూ. 25 లక్షల వేతన ప్యాకేజీపై పాత పన్ను విధానంలో రూ. 4,36,800 టాక్స్ పడుతుంది. కొత్త దాంట్లో ఇది రూ. 3,19,800 గా ఉంది. ఇక్కడ కొత్త పన్ను విధానంలోనే రూ. 1.17 లక్షల వరకు ఆదా అవుతుంది.ఇదీ చూడండి: మరి పాత పన్ను విధానం ఎప్పుడు బెస్ట్ ఆప్షన్?పైన పేర్కొన్న లెక్కల్లో కొత్త టాక్స్ రెజిమేనే బెస్ట్ అని తేలినప్పటికీ, కొంత మంది సీనియర్ లేదా మిడిల్ లెవెల్ ఉద్యోగులకు ఇప్పటికీ పాత పన్ను విధానమే లాభదాయకంగా ఉంది. టాక్స్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం 6 మినహాయింపుల్ని భారీగా క్లెయిమ్ చేయగలిగితే పాత పన్ను విధానం ఎంచుకోవచ్చు. HRA- మెట్రో నగరాల్లో ఉంటూ సెక్షన్ 10 (13A) కింద రూ. 2 లక్షల కంటే ఎక్కువ హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తున్నప్పుడు.సెక్షన్ 80c కింద పెట్టుబడులు- ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎల్ఐసీ, మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్‌లలో రూ. 1.5 లక్షల వరకు ఏటా పెట్టుబడి పెడుతున్నప్పుడుఅదనపు NPS డిపాజిట్- సెక్షన్ 80CCD (1B) కింద అదనంగా రూ. 50 వేలు NPS లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడుహెల్త్ ఇన్సూరెన్స్ (80D)- కుటుంబ సభ్యులు లేదా తల్లిదండ్రుల కోసం మెడిక్లైమ్ ప్రీమియంలు కడుతున్నప్పుడుహోం లోన్ వడ్డీ - సొంతిల్లు ఉండి, హోం లోన్ వడ్డీ కింద ఏటా రూ. 2 లక్షల వరకు మినహాయింపు పొందుతున్నప్పుడు శాలరీ స్ట్రక్చరింగ్- కంపెనీ ద్వారా లభించే ఇతర టాక్స్- ఫ్రీ అలవెన్సులు ఎక్కువగా ఉన్నప్పుడు