క్యూ1లో TCS లాభం రూ.13,349 కోట్లు.. ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. జులై 15లో షేర్లు కొంటే డివిడెండ్ డబ్బులు

Wait 5 sec.

TCS Q1 Results: భారత ఐటీ రంగ దిగ్గజం, టాటా గ్రూప్‌నకు చెందిన లార్జ్ క్యాప్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లోని మొదటి త్రైమాసిక ఫలితాలను గురువారం రోజున మార్కెట్లు ముగిసిన తర్వాత విడుదల చేసింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అందుకుంటూ కంపెనీ లాభాల్లో వృద్దిని కనబరించింది. అయితే, అదిరే శుభవార్త చెప్పింది. ఇన్వెస్టర్లను ఖుషీ చేస్తూ డివిడెండ్ బొనాంజాను ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.12 డివిడెండ్ ఇస్తామని తెలిపింది. క్యూ1 ఫలితాల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. భారతీయ అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తొలి త్రైమాసికంలో రూ.13,349 కోట్ల నికర లాభాన్ని చూపించింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన చూసుకుంటే 5 శాతం వృద్ధి నమోదు చేసింది. ఉండగా ఇప్పుడు 5 శాతం మేర పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ బోర్డు మధ్యంతర డివిడెండ్ రూ.12 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ తేదీని జులై 15గా నిర్ణయించింది. అంటే జులై 14వ తేదీన మార్కెట్లు ముగిసేలోపు షేర్లు కొన్నవారికే అర్హత లభిస్తుంది. ఇక 2026-27 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో టీసీఎస్ ఆపరేషన్స్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 14 శాతం మేర పెరిగి రూ.72,275 కోట్లుగా నమోదు చేసింది. ఇక త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఆదాయం 2.2 శాతం మాత్రమే పెరిగింది.ఆపరేషన్స్ మార్జిన్ 24 శాతంగా ఉండగా నెట్ మార్జిన్ 19.2 శాతంగా తెలిపింది. ఆపరేషన్స్ నుంచి నెట్ క్యాష్ రూ.12,412 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ టెక్ దిగ్గజం ఆర్డర్ బుక్ విలువ 9.5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో ఎస్‌కేఎఫ్‌తో జరిగిన ఏఐ-ఆధారిత ట్రాన్స్‌ఫర్మేషన్ డీల్ 800 మిలియన్ డాలర్లు సైతం ఉంది. అలాగే సర్వీస్ నౌ తో జరిగిన మల్టీ మిలియన్ డాలర్ల ఆర్డర్ డీల్, యూరప్‌కి చెందిన ఫార్చ్యూన్ గ్లోబల్ 50 కంపెనీతోనూ మల్టీ మిలియన్ డాలర్ల డీల్ కుదిరినట్లు తెలిపింది. ప్రస్తుతం జూన్ 2026 ముగిసే నాటికి కంపెనీలో మొత్తం 5,93,798 మంది ఉద్యోగులు ఉన్నారు. ఐటీ సర్వీసెస్ ఉద్యోగుల వలసలు గత 12 నెలలుగా 13.6 శాతంగా ఉన్నట్లు తెలిపింది. తొలి త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అసోసిట్లందరికీ వార్షిక వేతన పెంపు ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించింది. కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం జీతాల విధానాన్ని మార్చామని తెలిపింది. పడి లేచిన షేరు ధరక్యూ1 ఫలితాల ప్రకటన వేళ జులై 9వ తేదీన టీసీఎస్ షేరు మార్కెట్ ప్రారంభం నుంచి నష్టాల్లోనే ట్రేడయింది. ఇంట్రాడేలో రూ.2057 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టగా ఒక దశలో భారీగా తగ్గి రూ.2016 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మార్కెట్లు ముగిసే నాటికి 0.073 శాతం స్వల్ప లాభంతో రూ.2059 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.7.40 లక్షల కోట్లుగా ఉంది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్స్ 3.11 శాతంగా ఉంది.