"ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్‌ కొవ్వెక్కి, బలిసి మాట్లాడుతున్నారు..పవనే ఎందుకు టార్గెట్?" : సాదినేని యామిని

Wait 5 sec.

.. ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా వినిపిస్తున్న యూట్యూబర్ పేరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయన అరెస్ట్ కావటం.. ఆ తర్వాత జాతీయ నమోదు కావటం తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇక ప్రశ్న రావణ్‌కు మద్దతుగా సినీ నటుడు ట్వీట్లు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామాలపై స్పందించిన .. మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. " వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వే్చ్ఛ, నాస్తికత్వం, హేతువాదం పేరుతో.. హిందూ దేవతలను, హిందువులను దుర్భాషలాడే, నీచంగా మాట్లాడే హక్కు రాజ్యాంగంలో ఎక్కడా లేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం అంటే మన హక్కుల కోసం మనం మాట్లాడటం.. లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు. అంతే కానీ కోట్లాదిమంది భక్తులు విశ్వసించే దేవుళ్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మొన్న అతను (ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్) వెళ్లిన సభ దళిత క్రైస్తవ సభ. పర్మిషన్ తీసుకుందే ఆ విషయంపైనా.. వాస్తవానికి దళిత క్రైస్తవులు అనే పదం న్యాయస్థానంలో లేదు. అయితే దళితులు ఉంటారు, లేదా క్రైస్తవులు ఉంటారు. రాజ్యాంగ పరంగా, ప్రభుత్వ పరంగా దళిత క్రైస్తవులు అనే పదం లేదు. " అని సాదినేని యామిని మండిపడ్డారు. "దళిత క్రైస్తవ సభలో ఏం మాట్లాడాలి? వారి సమస్యల గురించి, లేదా భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకోవాలి. అలా కాకుండా దళిత క్రైస్తవ సభ పేరుతో అనుమతి తీసుకుని హిందూ దేవతలను దుర్భాషలాడటం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను, ఆయన కుటుంబాన్ని దుర్భాషలాడటం, కూటమి ప్రభుత్వాన్ని దుర్భాషలాడటం చేశారు. వీళ్లందరికీ ఇదో ఫ్యాషన్ అయిపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే మీకెందుకు నొప్పి? ఆయనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయనెప్పుడైనా వేరే మతానికి వ్యతిరేకంగా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకున్నారు. దాని గురించి మాట్లాడుతున్నారు. మీరంతా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?" అని సాదినేని యామిని ప్రశ్నించారు." నా నోరు, నా ఇష్టం అని మాట్లాడటం.. ఆ తర్వాత పోలీసులు కేసులు పెడితే.. నన్ను చంపేస్తారా, నేనే ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరింపులు.. ఇదంతా ప్రజలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించే ప్రయత్నం కాదా? జోసెఫ్ హేతువాది అని చెప్పుకుంటున్నారు. మరెందుకు క్రైస్తవ సభలకు వెళ్తున్నారు? మీకు హిందూ దేవతలంటే ఇష్టం లేనప్పుడు పూజించొద్దు. తిట్టడం ఎందుకు? మనోభావాలు, వాక్ స్వాతంత్య్రం మీకు మాత్రమే ఉంటాయా? మాకు, హిందువులకు ఉండవా? జోసెఫ్ ఎంత నీచంగా మాట్లాడాడు.. " అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రకాష్ రాజ్ నాస్తికత్వం అంటాడు.. నాస్తికులు, హేతువాదులమని చెప్పుకునే జోసెఫ్, ప్రకాష్ రాజ్, చందు తులసిని నేను అడుగుతున్నా. హిందూ ధర్మాన్ని టార్గెట్ చేయమని, తిట్టమని, చిచ్చుపెట్టమని మీకేమైనా రాజ్యాంగం రాసిచ్చిందా.. మీరేమో అడ్డగోలుగా, బాగా కొవ్వెక్కి, బలిసి.. ఏదిపడితే అది మాట్లాడొచ్చు. తిరిగి రియాక్షన్ ఉంటే మాత్రం మమ్మల్ని ఇది చేస్తున్నారు. అది చేస్తున్నారని ఏడుపులు.." అంటూ ఓ రేంజులో ఫైరయ్యారు.