హమ్మయ్యా.. ఎట్టకేలకు ITR పోర్టల్‌లో 'అదర్ ఇన్‌కమ్' కాలమ్.. ట్యాక్స్ నోటీసులు రాకుండా ఉండేందుకే!

Wait 5 sec.

ITR Utility: ఐటీఆర్ ఫైలింగ్ పోర్టల్‌లో ఎగ్జెంప్ట్ ఇన్‌కమ్ షెడ్యూల్ (Schedule EI పన్ను మినహాయింపు ఆదాయం) కింద తాజాగా అదర్ ఇన్‌కమ్ అనే కొత్త కాలమ్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం యాడ్ చేసింది. గతంలో నిర్దేశిత కేటగిరీల్లోకి రాని కొన్ని మినహాయింపు ఆదాయాలైన గ్రామీణ వ్యవసాయ భూమి అమ్మకం డబ్బులు, బంధువులు ఇచ్చే బహుమతుల వంటివి చూపించేందుకు సరైన ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఇబ్బందులను తొలగిస్తూ ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీఆర్ యుటిలిటీల్లో ఈ కొత్త కాల్ ద్వారా ట్యాక్స్ పేయర్లకు ఊరట కల్పించింది. ఇక నుంచి తమకు వచ్చిన ఎలాంటి నాన్ ట్యాక్సబుల్ ఆదాయాన్నైనా స్వచ్ఛందంగా వెల్లడించవచ్చు. దీంతో భవిష్యత్తులో ఐటీ శాఖ నుంచి అనవసరపు ట్యాక్స్ నోటీసులు, స్కృటినీ నోటీసులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. మీరు ఉద్యోగం చేస్తున్నా, పెన్షనర్ అయినా, విద్యార్థి లేదా మరెవరైనా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైల్ చేస్తే పెనాల్టీలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈసారి ఐటీఆర్ ఫైలింగ్‌లో కొత్త అప్డేట్ వచ్చింది. ఐటీఆర్ ఫైలింగ్ యుటిలిటీని అప్డేట్ చేస్తూ ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మినహాయింపు ఆదాయాలకు సంబంధించి అదర్ ఇన్‌కమ్ కాలకమ్ తీసుకొచ్చింది. ఈ విషయంపై చార్టర్డ్ అకౌంటెంట్ హిమాంక్ సింగ్లా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. 'గ్రామీణ వ్యవసాయ భూమి అమ్మకం లేదా బంధువుల నుంచి పొందిన బహుమతులు ఆదాయం కిందకు రావు కాబట్టి వాటిని ప్రత్యేకంగా నివేదించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, అనవసరమైన పన్ను నోటీసులను నివారించడానికి చాలా మంది నిపుణులు వాటిని 'మినహాయింపు ఆదాయం' షెడ్యూల్ కింద పేర్కొనేవారు. అయితే, గతంలో తొలగించిన ఈ నివేదన విధానాన్ని ఇప్పుడు తిరిగి ప్రవేశపెడుతున్నారు.' అని ఎక్స్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. కొత్త ఫీచర్ అర్థమేంటి?షెడ్యూల్ EI ఇతర మినహాయింపు ఆదాయం (Other Exempt Income) వివరాలను నమోదు చేయడానికి మొదట్లో స్పష్టమైన 'అదనపు/ఇతర' విభాగం అందుబాటులో లేదు. దీనివల్ల, యుటిలిటీలో ఉన్న నిర్దిష్ట విభాగాల పరిధిలోకి రాని మినహాయింపు ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాలనుకున్న పన్ను చెల్లింపుదారులకు ఆచరణాత్మక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, అప్‌డేట్ చేసిన ఈ యూటిలిటీ ఇప్పుడు మినహాయింపు పొందిన ఆదాయం విభాగంలో 'ఇతర ఆదాయం' కోసం ఒక కాలమ్‌ను చేర్చడం ద్వారా అవకాశం కల్పిస్తోంది. దీని అర్థం ఏమిటంటే, పన్ను చెల్లింపుదారునికి పన్ను మినహాయింపు వర్తించే ఆదాయం ఉండి, అది నిర్దిష్ట మినహాయింపు ఆదాయ వర్గాలలో దేనిలోనూ చేరని పక్షంలో, ఆ ఆదాయాన్ని వెల్లడించడానికి వారికి ఇప్పుడు ఒక మార్గం లభిస్తుంది. అలాగే, గ్రామీణ వ్యవసాయ భూమి అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం, నిర్దిష్ట బంధువుల నుంచి పొందిన బహుమతులు వంటి ఆదాయాలను పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి కలపాల్సిన అవసరం లేదు.ప్రత్యేకంగా పేర్కొనే అవకాశం రావడంతో భవిష్యత్తులో ఐటీ నోటీసులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు.