వియత్నాంలో భారతీయ టూరిస్ట్‌ బోటు ప్రమాదానికి కారణం ఇదేనా?

Wait 5 sec.

వియత్నాంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ‘ఫు క్వాక్’ ద్వీపం వద్ద శనివారంచెందగా.. పలువురు గల్లంతయ్యారు. లావా మొబైల్ ఫోన్ల సంస్థ భారత్‌లోని తమ డీలర్లను ట్రిప్ కోసం వియత్నాం తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఇండియా నుంచి వెళ్లగా.. వీరిలో 35 మంది ఏపీ, 40 మంది తెలంగాణకు చెందిన డీలర్లు ఉన్నారు. హోన్ మే రేట్ నుంచి అన్ థోయ్ పోర్టుకు స్పీడ్ బోటులో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. హోన్ మే రుట్ నగోయ్ తీరానికి 400 మీటర్ల దూరంలో స్పీడ్‌బోట్ మునిగిపోవడంతో అందులో ఉన్న వారందరూ సముద్రంలో పడిపోయినట్టు స్థానిక మీడియా నివేదించింది. పడవ మునిగిపోయినప్పుడు సముద్రం అల్లకల్లోలంగా ఉందని తెలిపింది. బలమైన గాలులు, ఉవ్వెత్తున్న అలలు ఎగిసిపడినట్టు పేర్కొంది. దీని వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాద సమయానికి 32 టూరిస్ట్‌ల సహా 36 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.ప్రమాదంలో కడపకు చెందిన ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, కాకినాడకు చెందిన మరో యువకుడు ఈ ఘటనలో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ఏపీ వాసులు గల్లంతయ్యారు. మొత్తం 21 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.సహాయ కార్యక్రమాలను పర్యవేక్షణ, వియత్నాం అధికారులతో సమన్వయం, భారతీయ పౌరులకు మద్దతు ఇవ్వడానికి భారత దౌత్యవేత్త, రాయబార కార్యాలయ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. ఘటనపై లావా మొబైల్స్ తమ బృంద సభ్యులు, ఛానల్ భాగస్వాములలో కొందరు ఈ సంఘటనలో చిక్కుకున్నారని తెలిపింది. ‘‘మా సిబ్బంది భద్రత, క్షేమ సమాచారం కోసం మేము వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. ప్రభావితమైనవారు, వారి కుటుంబాలకు సాధ్యమైనంత మద్దతును అందించడమే మా తక్షణ ప్రాధాన్యత. భారత్, వియత్నాంలోని మా బృందాలు బాధిత కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సాధ్యమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తున్నాయి’’ అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి వివరాలు కోరారు. బాధితులకు, వారి కుటుంబాలకు సాధ్యమైనంత సహాయం అందేలా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. పర్యాటకులకు, వారి కుటుంబాలకు మద్దతుగా హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్, హనోయిలోని రాయబార కార్యాలయం రెండు ప్రదేశాలలో కంట్రోల్ రూమ్‌లను తెరిచింది.