ఒక్కరోజే 90 శాతం పడిపోయిన స్టాక్.. రూ.132 నుంచి రూ.13కు డౌన్.. ఇన్వెస్టర్లలో టెన్షన్ టెన్షన్!

Wait 5 sec.

Stock Split: స్మాల్ క్యాప్ కేటగికి చెందిన ప్రముఖ పునరుత్పాదక ఇంధన కంపెనీ భారీగా పడిపోయింది. క్రితం రోజు ముగింపు ధరతో పోలిస్తే ఏకంగా 90 శాతం నష్టంతో ట్రేడింగ్ మొదలు పెట్టింది. దీంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఈ పతనాన్ని చూసి ఆందోళన చెందాల్సి వచ్చింది. ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోతాయా అనే సందేహం సైతం వ్యక్తం చేశారు. అయితే, ఈ స్టాక్ ఒక్కసారిగా 90 శాతం మేర పడిపోయేందుకు ఓ ప్రధాన కారణం ఉంది. కంపెనీ చేపట్టిన కార్పొరేట్ యాక్షన్ కారణంగా ఇలా జరిగింది. ఈ స్టాక్ ఈరోజు ఎక్స్ స్ప్లిట్ ట్రేడింగ్ నిర్వహించడంతో స్టాక్ ధర రూ.132 స్థాయి నుంచి రూ.13 స్థాయికి పడిపోయింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.గుజరాత్ ఇంజెక్ట్ కేరళ లిమిటెడ్ (Gujarat Inject Kerala Limited) కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కొద్ది రోజుల క్రితం సమావేశమై 10:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టాలని నిర్ణయించారు. అందుకు జులై 8వ తేదీని రికార్డ్ తేదీగా నిర్ణయించారు. దీని ప్రకారమే ఇవాళ ఈ స్టాక్ ఎక్స్ స్ప్లిట్ ట్రేడింగ్ నిర్వహించింది. దీంతో 1 షేరు కాస్త 10 షేర్లుగా మారుతుంది. రూ.10 ముఖ విలువ ఉన్న షేరును రూ.1 ముఖ విలువ గల ఈక్విటీ షేరుగా విభజిస్తారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం T+1 ట్రేడింగ్ సెటిల్మెంట్ ఉంటుంది. అంటే జులై 7వ తేదీ మార్కెట్లు ముగిసే నాటికి షేర్లు కొన్నవారికి ఈ బెనిఫిట్ లభిస్తుంది.నష్టంతో రూ.13.90 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఆందోళన పడాల్సి వచ్చింది. అయితే స్టాక్ స్ప్లిట్ ద్వారా స్టాక్ ధర తగ్గినా మదుపరుల పెట్టుబడి విలువలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. అందుకు తగినట్లుగా డీమ్యాట్ అకౌంట్లో షేర్ల సంఖ్య 10 రెట్లు పెరగనుంది. 1 షేరు ఉన్నవారికి 10 షేర్లు, 10 షేర్లు ఉన్నవారికి 100, వంద షేర్లు ఉన్నవారికి 1000 షేర్లు వస్తాయి.ఈ స్టాక్ ఇవాళ 90 శాతం పడిపోయినా గత ఆరు నెలల్లో మాత్రం ఈస్టాక్ 257 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఏడాది కాలంలో 463 శాతం లాభపడింది. అంటే ఏడాది క్రితం ఇందులో రూ.1 లక్షపెట్టి షేర్లు కొన్నవారికి రూ.5.63 లక్షలు వస్తాయి. ఇక 5 ఏళ్లలో 4508 శాతం మేర పెరిగింది. అంటే లక్ష రూపాయలకు ఏకంగా రూ.45 లక్షలకు పైగా వచ్చాయి. అయితే, ఈ స్టాక్ స్ప్లిట్ ద్వారా షేరు ధర భారీగా తగ్గుతుంది. కానీ, ఆ తర్వాత పెరిగితే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది.