ఏపీ డిప్యూటీ సీఎం జరిగిన సంగతి తెలిసిందే. కుడి భుజానిపూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై కోకిలాబెన్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పవన్ కుడి భుజానికి రొటేటర్ కఫ్ గాయమైందని.. రెండు స్నాయువులు తీవ్రంగా చిట్లినట్లు వైద్యులు తెలిపారు. అలాగే అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉన్నట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. శస్త్రచికిత్స పూర్తైందని.. పూర్తిగా కోలుకోవడానికి 4 నెలల వరకూ సమయం పడుతుందని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. "పవన్ కళ్యాణ్ కుడి భుజానికి రొటేటర్ కఫ్ గాయం అయినట్లు నిర్ధారణ అయింది. ఈ గాయంలో సుప్రాస్పినేటస్, ఇన్‌ఫ్రాస్పినేటస్ స్నాయువులు తీవ్రంగా చిట్లడంతో పాటు, గ్రేటర్ ట్యూబరోసిటీ ఎముక అవల్షన్ ఫ్రాక్చర్‌కు గురైంది. జూలై 11వ తేదీ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో ఆర్థ్రోస్కోపిక్ పద్ధతిలో గాయానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్సను ఆర్థ్రోస్కోపీ, షోల్డర్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ దిన్‌షా పార్దివాలా నిర్వహించారు. సర్జరీ ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సౌకర్యంగా ఉన్నారు. చక్కగా కోలుకుంటున్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకుని కోలుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ షోల్డర్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనుసరించాలి. భుజం పనితీరు పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది" అని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు.మరోవైపు డిప్యూటీ సీఎం . మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, ఎంపీ లింగమనేని రమేష్ ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెలతో మాట్లాడిన చంద్రబాబు.. పవన్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులతోనూ మాట్లాడి, వివరాలు అడిగి కనుక్కున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ప్రజా క్షేత్రంలోకి నూతనోత్సాహంతో, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు కీలకమైన శస్త్ర చికిత్స జరిగిందని.. మూడున్నర గంటలపాటు వైద్యుల బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారని తెలిపారు. ఏళ్ల తరబడి ఉన్న తీవ్రమైన గాయాన్ని ప్రజాసేవలో నిమగ్నమై నిర్లక్ష్యం చేశారని.. ఇప్పుడు శస్త్రచికిత్స విజయవంతం కావడంతో, ఆయన పూర్తిగా కోలుకుంటున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఆపరేషన్ విజయవంతమైందన్న చంద్రబాబు.. వైద్యుల పర్యవేక్షణ, ఫిజియోథెరపీ వంటివి ఉంటాయని తెలిపారు.మూడు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో, ఫిజియోథెరపీ చేయడం వల్ల భుజానికి ఉన్న సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పవన్ కళ్యాణ్ రెండో భుజానికి కూడా సమస్య ఉన్నట్లు వైద్యులు చెప్పారన్న చంద్రబాబు. కుడి భుజానికి ఉన్న సమస్య తీరిన తర్వాత 6 నెలలు వేచి చూసి, ఆ తర్వాత మళ్లీ వైద్యుల పరీక్షలు చేస్తారని తెలిపారు. ఎడమ భుజానికి ఆపరేషన్ అవసరం అవుతుందా..? లేక ఫిజియోథెరపీతో పరిష్కారం అవుతుందా అప్పుడు నిర్ణయిస్తారని చంద్రబాబు వివరించారు.