ఓటీటీలోకి సమంత రూ.100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Wait 5 sec.

సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ యాక్షన్‌ కామెడీ డ్రామా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘మా ఇంటి బంగారం’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్‌ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. రూ.100 కోట్ల క్లబ్ లో చేరిందని ప్రకటించిన రోజే, ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా వెల్లడించారు. జులై 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిపింది. ‘ఒక్కొక్కడిని కొడతాం చూడు.. ప్రేమతో అబ్బా..’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న థియేటర్లలో రిలీజయింది. సరిగ్గా నాలుగు వారాల్లో ఓటీటీలోకి రానుంది. బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సమంత మూవీ.. డిజిటల్ వరల్డ్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని నిర్మించారు. 'శుభం' తర్వాత సామ్ నిర్మాణంలో రూపొందిన రెండో చిత్రమిది. ఇందులో గుల్ష‌న్ దేవ‌య్య విలన్ గా నటించగా.. దిగంత్‌, గౌత‌మి, మంజుషా, యాంకర్ శ్రీముఖి తదితరులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.