రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్ల జోరు.. లార్డ్స్‌లో చారిత్రాత్మక గెలుపుకు చేరువగా భారత్!

Wait 5 sec.

లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్‌పై తన పట్టును మరింత బిగించి చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన భారీ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్, ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరిగెత్తించింది. మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లు ముగిసే సరికి 100/5తో నిలిచింది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 357 పరుగులు అవసరం కాగా.. భారత్ మరో ఐదు వికెట్లు సాధిస్తే చరిత్రాత్మక విజయం సాధిస్తుంది. కాసేపటికే వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 161 వద్ద స్మృతి మంధాన 70 రన్స్ చేసి ఔట్ అయింది. అయితే యస్తికా భాటియా మాత్రం అదరగొట్టింది. లార్డ్స్‌లో శతక్కొట్టి.. టెస్ట్ క్రికెట్‌లో ఇక్కడ సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 113 పరుగులు చేసిన అనంతరం ఆమె పెవిలియన్ చేరింది. ఆమె ఔట్ అయిన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో రిచా ఘోష్ 50 రన్స్ నాటౌట్‌తో భారత్ భారీ స్కోరు చేసింది. 341/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ఎదురీదుతోంది. 29 ఓవర్లు ముగిసే సరికి 100/5తో నిలిచింది. ఈ మ్యాచులో గెలవాలంటే ఆ జట్టు ఇంకా 357 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది దాదాపు అసాధ్యం. దీంతో చరిత్రాత్మక విజయంపై భారత మహిళల జట్టు కన్నేసింది.ఇక భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, సయాలి చెరో రెండు వికెట్లు తీశారు. స్నేహ్ రాణా ఒక వికెట్ పడగొట్టింది. క్రాంతి గౌడ్ తొలి ఇన్నింగ్స్‌లో ఫైఫర్ నమోదు చేసింది.