వయనాడ్‌‌లో విపత్తుకు కొన్ని క్షణాల ముందు.. దూసుకొచ్చిన ట్యాంకర్.. ఒళ్లు గగ్గొర్పొడిచే దృశ్యాలు

Wait 5 sec.

కేరళలోని ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గల్లంతయ్యారు. అలాగే, 10 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఒక భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విపత్తుకు కొన్ని క్షణాల ముందు రహదారిపై ఒక ట్యాంకర్‌, అనేక వాహనాలు కొట్టుకుపోయిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అకస్మాత్తుగా భూమి కుంగిపోవడంతో భారీగా మట్టి, శిథిలాలు కొండపై నుంచి కిందికి దూసుకొస్తుండగా.. గొడుగుల కింద నిలబడి పలువురు దూరం నుంచి చూస్తున్నట్లు ఆ ఫుటేజీలో కనిపిస్తుంది. ఆ ట్యాంకర్ దాదాపు 100 అడుగుల లోతుకు పడిపోయిందని, అందులో ఉన్న ముగ్గురు త్రుటిలో తప్పించుకున్నారని సమాచారం.భారీ వర్షాలతో ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి విధ్వంసం సృష్టించాయి. టన్నెల్ ప్రాజెక్ట్ సైట్‌లోని కొన్ని భాగాలు కూలిపోవడమే కాకుండా, ఒక చర్చి, సమీపంలోని ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. అదృష్టవశాత్తు, ఈ రెండు కట్టడాలలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అందులో నివసించేవారు తీర్థయాత్ర నిమిత్తం మక్కాకు వెళ్లినందున ఆ ఇంటికి తాళం వేసి ఉంది. అయితే విపత్తు సంభవించినప్పుడు చర్చిలో ఎవరూ లేరు.కీలకమైన మౌలిక సదుపాయాలు కూలిపోవడంతో సహాయక చర్యలు సంక్లిష్టంగా మారాయి. ప్రభావిత ప్రాంతాలను కలిపే ఒక వంతెన శిథిలాల కింద కూరుకుపోవడంతో అత్యవసర బృందాలు, భారీ యంత్రాలు ఆ ప్రదేశానికి చేరుకోవడం కష్టంగా మారింది. కాగా, ఘటనాస్థలి నుంచి వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో భారీ మట్టి దిబ్బలు, దెబ్బతిన్న నిర్మాణాలు, క్లిష్ట పరిస్థితుల మధ్య పనిచేస్తున్న సహాయక సిబ్బంది కనిపిస్తున్నారు.ఈ ఫుటేజ్ సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించి, కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన విధ్వంసం తీవ్రతను వెలుగులోకి తెచ్చింది. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతుండగా, అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. రెండేళ్ల కిందట కూడా ప్రకృతి ప్రకోపానికి వయనాడ్‌ విలవిలలాడిపోయింది. గ్రామానికి గ్రామమే భూస్థాపితమైపోయి.. వందల మంది సజీవసమాధి అయ్యారు.