SCSS Interest Rate: మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో , (MIS) వంటివి అత్యంత ఆదరణ పొందిన వాటిల్లో ఉన్నాయి. 2026 జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త వడ్డీ రేట్లను ప్రకటించినా మరోసారి వీటిని స్థిరంగానే ఉంచింది. ఈ ప్రకారం ప్రస్తుతం SCSS స్కీంలో వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 8.20 శాతంగా ఉండగా, ఇదే సమయంలో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం పథకంలో వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. ఇప్పుడు మనం ఈ రెండు స్కీంలలో రూ. 5 లక్షల డిపాజిట్‌పై ఏటా ఎంత వడ్డీ పొందొచ్చనేది తెలుసుకుందాం. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీంలో రూ. 5 లక్షలు ఒకేసారి జమ చేస్తే 8.20 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం ఇక్కడ ఏటా రూ. 40,996 చొప్పున వడ్డీ అందుతుంది. ఇలా ఐదేళ్ల పాటు వస్తుంది. ఇలా ఐదేళ్లలో వడ్డీతోనే రూ. 2,04,980 వస్తుందని చెప్పొచ్చు. ఈ పథకంలో గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది. ఇది కేవలం సీనియర్ సిటిజెన్లకే అందుబాటులో ఉన్న పథకం. ఈ స్కీంలో ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ అందుతుంది. మెచ్యూరిటీకి అంటే ఐదేళ్లకు మీ పెట్టుబడి కూడా వెనక్కి వస్తుంది. ఇక ఇక్కడ వడ్డీ రేటు 7.40 శాతంగా ఉండగా ఇక్కడ ప్రతి నెలా వడ్డీ వస్తుంది. ఇలా ఏడాదికి వడ్డీ రూ. 36,996 వస్తుంది. మొత్తంగా ఐదేళ్లలో చూస్తే వడ్డీతోనే రూ. 1,84,980 వస్తుంది. ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా అకౌంట్ తెరవొచ్చు. సింగిల్ అకౌంట్ కింద గరిష్ఠంగా 9 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే 15 లక్షల వరకు జమ చేయొచ్చు. ఈ లెక్కన చూస్తే మంత్లీ ఇన్‌కం స్కీంలో కంటే SCSS పథకంలో దాదాపు రూ. 20 వేల వరకు ఐదేళ్లలో అదనంగా లాభం వస్తుందని గుర్తించొచ్చు. కాబట్టి ఇక్కడ రిటర్న్స్ పరంగా చూస్తే ఎస్‌సీఎస్ఎస్ అధిక రాబడిని అందిస్తుంది. ఇక్కడ అధిక వడ్డీ రేటు ఉండటం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇదే సమయంలో సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీంలో ఇన్వెస్ట్ చేసే ఏడాదికి రూ. 1.50 లక్షల పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80c కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అదే ఎంఐఎస్‌లో టాక్స్ బెనిఫిట్స్ ఉండవు.