క్రికెట్ మక్కాగా పిలవబడే లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా మహిళల జట్టు 285 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 21/1తో నిలిచింది.ఇంగ్లాండ్ వాతావరణం, లార్డ్స్ పిచ్ ఎప్పటికప్పుడు పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందనే విషయం తెలిసిందే. తొలి రోజు ఆటలోనూ అదే పునరావృతమైంది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఓవర్ నుంచే ఇంగ్లాండ్ బౌలర్లు బంతిని ఇరువైపులా అద్భుతంగా స్వింగ్ చేస్తూ భారత ఓపెనర్లను క్రీజులో నిలదొక్కుకోనివ్వలేదు. అయితే ఈ దశలో వైస్ కెప్టెన్ జట్టును ఆదుకుంది. వన్డే తరహాలో చెలరేగిన ఆమె.. 108 బంతుల్లో 83 రన్స్ చేసింది. సెంచరీకి ముందు పెవిలియన్ చేరింది.కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (121 బంతుల్లో 58 రన్స్), దీప్తి శర్మ (87 బంతుల్లో 57 రన్స్) రాణించడంతో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. చివర్లో టప టపా వికెట్లు కోల్పోయి.. 74.5 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్సెల్ స్టోన్ 3 వికెట్లు తీసింది. లారెన్ ఫైలర్, ఇస్సీ వాంగ్, మ్యాడీ విలియర్స్ రెండేసి వికెట్లు తీశారు. లారెన్ బెల్ ఒక వికెట్ పడగొట్టింది.అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మహిళల జట్టుకు భారత డెబ్యూ పేసర్ క్రాంతి గౌడ్ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ టామ్సిన్ బ్యూమాంట్‌ను కేవలం 2 పరుగులకే ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేసి భారత్‌కు మంచి బ్రేక్‌త్రూ ఇచ్చింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 11 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజులో మైయా బౌచియర్ (17), హీథర్ నైట్ (1) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 264 పరుగులు వెనుకబడి ఉంది.