నాలుగో టీ20లో భారత్‌ చిత్తు.. టీ20 సిరీస్ ఇంగ్లాండ్‌దే..!

Wait 5 sec.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ కోల్పోయింది. గురువారం ఆతిథ్య జట్టుతో జరిగిన నాలుగో టీ20 మ్యాచులోనూ టీమిండియా చిత్తుగా ఓడింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ .. అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది.బ్రిస్టోల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలం అవుతున్న టీమిండియా.. ఈ మ్యాచులోనూ అదే రిపీట్ చేసింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమయ్యారు. 10 బంతుల్లో 15 రన్స్ చేసి.. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ (4) సైతం విఫలమయ్యారు.ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలమవుతున్న ఇదే పిచ్‌పై ఈజీగా రన్స్ చేశాడు. 49 బంతుల్లో 80 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. కానీ అతడికి సహకరించేవారు లేకపోవడంతో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (16), శివమ్ దూబె (23 బంతుల్లో 22 రన్స్), తిలక్ వర్మ (8 బంతుల్లో 11 రన్స్), వాషింగ్టన్ సుందర్ (5) రాణించలేకపోయారు.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఎప్పుడెప్పుడు మ్యాచ్ ముగిద్దామా అన్నట్లు ఆ జట్టు బ్యాటింగ్ సాగింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 42 బంతుల్లో 59 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇక కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. 35 బంతుల్లో 79 పరుగులు స్కోరు చేశాడు. వీరిద్దరూ అజేయంగా నిలవడంతో ఇంగ్లాండ్ 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 9 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. నామమాత్రపు ఐదో టీ20 జులై 11న సౌథాంప్టన్ వేదికగా జరగనుంది.