ఇంట్లో తల్లిదండ్రుల గొడవ.. చికాకుతో బయటకెళ్లిన కొడుకు.. పొద్దున్నేకల్లా శవంగా!

Wait 5 sec.

ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కూడా ఒక్కోసారి చాలా పెద్దగా మారతాయి. తల్లిదండ్రులు గొడవ పడుతుంటే ఆ గోలను తట్టుకోలేక బయటకెళ్లిన కొడుకు శవంగా మారాడు. ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంటే తలపై పెద్ద దెబ్బ కనిపించింది. అప్పటికే మద్యం తాగి ఉండటంతో ఏమైందో ఏమో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఫోన్ చేస్తే అరగంటలో ఇంటికొస్తానన్న కొడుకు ఇలా శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటన రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. తిరుపతి రూరల్ పరిధిలోని ఆదోని మండలం మధిర గ్రామానికి చెందిన బి.శ్రీనివాసులు (36) ఏడేళ్ల కిందట తిరుపతికి వచ్చాడు. ఏడాది కిందట నుంచి ఓటేరు గ్రామంలో తన తల్లిదండ్రులు రాధమ్మ, వెంకటేశ్.. భార్య నిర్మల ఇద్దరు పిల్లలో కలిసి నివసిస్తున్నాడు. శ్రీనివాసులు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఉదయమంతా బయట పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడుతున్నారు. రోజూలాగే తల్లిదండ్రులు ఇంట్లో గొడవపడుతుండటంతో బుధవారం రాత్రి మద్యం తాగొచ్చిన శ్రీనివాసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా అక్కడ నుంచి బయటకు వెళ్లాడు. READ ALSO అర్ధరాత్రి అవుతున్నా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి 12:30 గంటల సమయంలో ఫోన్ చేస్తే వస్తున్నాలే అని చెప్పాడు. ఎంతసేపటికీ రాకపోయే సరికి ఎక్కడికి వెళ్లాడో ఇంట్లో వాళ్లకి అర్థం కాలేదు. ఉదయం లేచే సరికి తమ కొడుకు ఓటేరు సమీపంలోని జాతీయ రహదారి పక్కన శవంగా మారాడు అని చెప్పడంతో గుండెలు పగిలేలా ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. తొలుత ఆత్మహత్య చేసుకున్నాడా? అని ఇంట్లో వాళ్లు అనుకున్నారు. కానీ, ఎవరో తలపై కొట్టడంతోనే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఏమైంది? శ్రీనివాసులు ఇంకెవరితోనైనా గొడవ పెట్టుకున్నాడా? అన్న యాంగిల్‌లో పోలీసులు ఆలోచిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.