కాసులు కురిపిస్తున్న గోల్డ్ స్టాక్.. ఆ కారణంతో 3 రోజుల్లోనే 34 శాతం పెరిగిన షేరు.. వేల కోట్లు లాభం!

Wait 5 sec.

: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో సంగతి తెలిసిందే. అయితే ఇది ఒక్కరోజుకే పరిమితమైంది. మళ్లీ గురువారం లాభాలు నమోదు చేయగా, శుక్రవారం కూడా మంచి జోరుమీదే ఉన్నాయి. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో ఉదయం 11.20 గంటలకు ఏకంగా 700 పాయింట్ల లాభంతో 77440 స్థాయిలో ఉంది. ఒక దశలో ఆరంభంలో దాదాపు 800 పాయింట్లకుపైగా పెరిగింది. ఇక నిఫ్టీ 200 పాయింట్లకుపైగా పుంజుకొని 24170 స్థాయిలో కదలాడుతోంది. మార్కెట్ సానుకూలంగా ఉన్న క్రమంలో రిలయన్స్, హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం సహా పలు ఐటీ స్టాక్స్ రాణిస్తున్నాయి. ఇదే క్రమంలో భారతీయ రిటైల్ జువెల్లరీ రంగ దిగ్గజం కళ్యాణ్ జువెల్లర్స్ ఇండియా షేర్లు దూసుకెళ్తున్నాయి. గత కొంత కాలంగా నిరాశాజనక ప్రదర్శన చేసిన ఈ స్టాక్ మళ్లీ ఊహించని రీతిలో పుంజుకుంది. వరుసగా 3 సెషన్లు భారీగా పెరగ్గా ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తోంది. బుధ, గురు, శుక్రవారాల్లో కలిపి 3 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ షేరు ధర ఏకంగా 34 శాతం పెరగడం విశేషం. శుక్రవారం సెషన్‌లో ఇంట్రాడేలో దాదాపు 9 శాతం వరకు పెరిగి బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్‌లోనే టాప్ గెయినర్‌గా నిలిచింది. ప్రస్తుతం 7 శాతానికిపైగా పెరిగి రూ. 475 వద్ద ఉంది. ఇంట్రాడేలో రూ. 483.40 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. గత 3 ట్రేడింగ్ సెషన్లలో 34 శాతం పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 11,500 కోట్లు పెరిగింది. అంటే ఆ మేర కంపెనీ మార్కెట్ విలువ పుంజుకుందన్నమాట. ప్రస్తుతం కళ్యాణ్ జువెల్లర్స్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 48,533 కోట్లుగా ఉంది.Read Also: ఈ సడెన్ రికవరీతో 2026లో ఇప్పటివరకు ఉన్న నష్టాలన్నీ ఒకసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ ఈ సంవత్సరం ఇంకా 7.5 శాతం వరకు నష్టాల్లో ఉండగా, కళ్యాణ్ జువెల్లర్స్ షేరు కేవలం 2.1 శాతం మాత్రమే నెగెటివ్‌లో ఉంది. ఈ సంస్థ ఇటీవల క్యూ1 బిజినెస్ అప్డేట్ పంచుకుంది. భారతదేశ వ్యాపార ఆదాయం దాదాపు 38 శాతం పెరగనున్నట్లు అంచనా వేయగా, అంతర్జాతీయంగానూ వృద్ధి 35 శాతం వరకు ఉంటుందని పేర్కొంది. ఇంకా కళ్యాణ్ జువెల్లర్స్ లాంగ్ టర్మ్ గ్రోత్ స్ట్రాటజీ కూడా బలంగానే ఉన్నట్లు తెలిసింది. దీంతో సిటీ గ్రూప్ సహా పలు బ్రోకరేజీలు ఈ స్టాక్‌కు బై రేటింగ్ ఇస్తూ, టార్గెట్ ప్రైస్ పెంచేశాయి. ఇంకా రాబోయే పండగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో రెండో త్రైమాసికంలోనూ మరింత సానుకూల వృద్ధి ఉంటుందని కంపెనీ యాజమాన్యం విశ్వాసం వ్యక్తం చేయడం ఇన్వెస్టర్లలో జోష్ నింపింది.