ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాలు క్రమబద్ధీకరణ, ఇక వారంతా పర్మినెంట్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న 23 మంది ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించింది. వీరిలో ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసీ అధికారులు, ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌(మలేరియా), మహిళా నర్సింగ్‌ హెల్పర్, మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌(మహిళ) కేటగిరీలకు చెందిన ఉద్యో్గులు ఉన్నారు. 2024 ఏప్రిల్‌ 1 నుంచి ఈ 23మంది ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఈ ఉద్యోగులకు సంబంధించి గత సేవా కాలానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కోరే అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కాంట్రాక్ట్ నుంచి రెగ్యులర్‌ అయిన ఈ ఉద్యోగులను జూనియర్‌ మోస్ట్‌ ఉద్యోగులుగా పరిగణిస్తారని కూడా తెలిపారు. ఈ 23మంది ఉద్యోగులకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, టెక్నికల్ అర్హతలు, రిజర్వేషన్‌ తదితర వివరాలను సంబంధిత అధికారులు పరిశీలంచి పూర్తిగా ధ్రువీకరించిన తర్వాతే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రత్యేక అధికారుల పాలన మరో ఆరు నెలలు పొడిగించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కందుకూరు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, పల్నాడు జిల్లా నరసరావుపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, నెల్లూరు జిల్లా కావలి, ఏలూరు జిల్లా చింతలపూడి, గుంటూరు జిల్లాలోని తాడిగడప.. ప్రకాశం జిల్లాలోని పొదిలి, అల్లూరు, బి.కొత్తకోట పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించారు. ఈ మేరకు ప్రత్యేక అధికారుల పానను పొడిగిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెలలో ప్రత్యేక అధికారుల పదవీ కాలం ముగియనుండటంతో ఆరు నెలల పొడిగింపునకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం కొత్తగా ఐపీఎస్‌లను కేటాయించింది. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌కు ఎంపికైన 14 మందిని కేటాయించింది. వీరిలో ఏపీకి చెందిన చల్లా పవన్‌ కల్యాణ్, దోనెపూడి విజయ్‌బాబు, చక్కా స్నేహిత్, పెండెం ప్రత్యూష్‌ ఉన్నారు.