ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీకి, రాజకీయలకు గుడ్ బై చెప్పారు.. వ్యవసాయానికి పరిమితం అవుతానని ప్రకటించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు.. తెలుగు రాష్ట్రాలకు, మరీ ముఖ్యంగా ఏపీకి సంబంధించి అంశాలపై తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అందరితో పంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో అమరావతి వర్సెస్ మావిగన్, ప్రశ్న రావణ్ ఎపిసోడ్ సహా అన్ని అంశాలపై స్పందించారు. తాజాగా దేశవ్యాప్తంగా వర్షాలు, వరదలతో ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఎదురవుతున్న ఇబ్బుందుల్ని ప్రస్తావిస్తూ అమరావతి విషయంలో ఆ తప్పు చేయొద్దని కోరుతున్నారు. 'ఢిల్లీ నుంచి ముంబై వరకు, గురుగ్రామ్ నుండచి కేరళ వరకు.. మన దేశంలోని నగరాలు రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న ప్రతి భారీ వర్షాన్ని తట్టుకోవడంలో అసమర్థతను బయటపెడుతోంది. అమరావతి కూడా వరద ముప్పు ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి.. మనం అవే తప్పులను పునరావృతం చేయకూడదు. ఈ సంక్షోభ నిర్వహణ స్థానంలో ముందుగానే సంసిద్ధతను తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పనిసరిగా నగరాల్లో, పట్టణాల్లో మురుగునీటి పారుదల, వరదలను తట్టుకునే సామర్థ్యం, వర్షపునీటి మౌలిక సదుపాయాల ప్రమాణాలను అమలు చేయడానికి రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ గారిని నేను కోరుతున్నాను' అంటూ ట్వీట్ చేశారు.మరోవైపు రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై కూడా విజయసాయిరెడ్డి స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది పొగాకు రైతుల దుస్థితిపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గతేడాది కిలోకు సుమారు రూ.360 ధర పలికిన పొగాకు, ఇప్పుడు సగటున కిలోకు కేవలం రూ.220 మాత్రమే లభిస్తోంది. ఇది రైతుల ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేను వాణిజ్య పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు మన రైతులకు మెరుగైన ధరలు కల్పించేందుకు ఎగుమతుల విషయంలో దూకుడుగా వ్యవహరించాలని.. అలాగే చైనా, ఇండోనేషియా వంటి దేశాలతో భారతదేశానికి ఉన్న పొగాకు వాణిజ్య లోటును తగ్గించాలని పొగాకు బోర్డుకు గట్టిగా సూచించాను. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ గారు తక్షణమే జోక్యం చేసుకుని.. ఎగుమతులు పెరిగేలా చేసి, మన పొగాకు రైతులకు వారి పంటకు లాభదాయకమైన ధరలు అందేలా చూడాలని కోరుతున్నారు' అంటూ ట్వీట్ చేశారు.ఇటీవల . రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో క్లారిటీకి రాకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ పరిణామాలతో ప్రజలు కూడా గందరగోళంలో ఉన్నారని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి.