సీనియర్లకు బెస్ట్ పోస్టాఫీస్ పథకం.. 3 నెలలకోసారి రూ.50 వేలు ఇస్తారు.. ఎంత కట్టాలి? లెక్కలు ఇవే..

Wait 5 sec.

SCSS: పదవీ విరమణ తర్వాత ఒక్కసారిగా ఆదాయం ఆగిపోతుంది. చేతికి వచ్చే డబ్బు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే, సరైనా ప్లాన్ ఉంటే రిటైర్మెంట్ తర్వాత సైతం ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిశ్చింతగా జీవించవచ్చు. రిటైర్ అయ్యాక ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితమైన పెట్టుబడితో పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోస్టాఫీసు అందిస్తున్న సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizens Saving Scheme) సరైన మార్గంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం 8.20 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అయితే, అందుకోవాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి అనే లెక్కలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 3 నెలలకోసారి చేతికి రూ.50 వేలుసీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పైన ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ ఇస్తున్నారు. దీని ప్రకారం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది లెక్కించవచ్చు. కావాల్సిన త్రైమాసికానికి ఒకసారి చేతికి రూ.50 వేలు రావాలి. అంటే సంవత్సరానికి రావాల్సిన మొత్తం వడ్డీ రూ.2,00,000 అవుతుంది. దీని ప్రకారం చూస్తే కావాల్సిన మొత్తం పెట్టుబడి రూ.24.40 లక్షలు అవసరమవుతుంది. ఒక సీనియర్ సిటిజన్ తన ఎస్‌సీఎస్ఎస్ ఖాతాలో రూ.24.40 లక్షలు డిపాజిట్ చేస్తే వారికి ప్రతి 3 నెలలకోసారి కచ్చితంగా రూ.50 వేలు వడ్డీ రూపంలో ఖాతాలో జమ చేస్తారు. 5 సంవత్సరాల మెచ్యూరిటీ కాలంలో మొత్తం వడ్డీ రూ.10 లక్షలు అవుతుంది. ఎస్‌సీఎస్ఎస్ ముఖ్యమైన వివరాలు ప్రస్తుతం ఈ పథకానికి వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. అయితే త్రైమాసికానికి ఒకసారి వడ్డీ రేట్లను కేంద్రం సమీక్షిస్తుంది. కొన్నిసార్లు పెంచడం, తగ్గించడం చేస్తారు. చాలా వరకు యథాతథంగా కొనసాగిస్తుంటారు. ఇందులో కనీస పెట్టుబడి రూ.1000గా ఉంది. గరిష్ఠంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. మెచ్యూరిటీ కాల వ్యవధి 5 సంవత్సరాలుగా ఉంటుంది. ఆ తర్వాత మరో 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు. వీటితో పాటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేయవచ్చు. ఎవరైనా అదనపు ఆదాయం కోసం రూ.30 లక్షల గరిష్ఠ పరిమితికి మించి పెట్టుబడి పెట్టవచ్చా? అంటే అలా కుదరదు. ఎవరైనా డిపాజిటర్ అంతకు మించి జమ చేసినా పోస్టాఫీస్ అదనపు డిపాజిట్ అమౌంట్‌ను రియంబర్స్మెంట్ చేస్తుంది. అంటే తిరిగి ఇచ్చేస్తుంది. అదనపు ఆదాయంపై పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు ప్రకారమే చెల్లిస్తుంది. 8.20 శాతం వడ్డీ రాదు. అది రిటర్న్ చేసిన తేదీ వరకు వడ్డీ వస్తుంది. అలాగే ఎస్‌సీఎస్ఎస్ అకౌంట్ తెరిచేందుకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత ఈ ఖాతాను క్లోజ్ చేసేందుకు అవకాశం ఉంది.