3 మ్యాచ్‌ల మురిపెం.. తుది జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీ ఔట్

Wait 5 sec.

ఇంగ్లాండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు భారత తుది జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఐదో మ్యాచ్ కోసం తుది జట్టు నుంచి మేనేజ్‌మెంట్ తప్పించింది. ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడికి, ఇంగ్లాండ్ పర్యటన ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అతడు.. వాటిని అందుకోలేక మూడు మ్యాచుల తర్వాత తుది జట్టులో చోటు కోల్పోయాడు.ఐపీఎల్‌‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన , ఎన్నో అంచనాల మధ్య ఈ ఇంగ్లాండ్ టూర్‌లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ ఒత్తిడిని, ముఖ్యంగా ఇంగ్లాండ్ కండిషన్స్‌ను అతడు తట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ వైభవ్ బ్యాటర్‌గా పూర్తిగా నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ స్వింగ్ బౌలింగ్, ఎక్స్‌ట్రా బౌన్స్‌ను రీడ్ చేయడంలో దారుణంగా తడబడ్డాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ వైభవ్‌కు వరుసగా మూడు మ్యాచ్‌లలో అవకాశాలు ఇచ్చింది. కానీ టెక్నిక్‌లో లోపాల కారణంగా వైభవ్ పదే పదే ఒకే రకమైన షాట్లకు ప్రయత్నిస్తూ వికెట్లు పారేసుకున్నాడు. భారత జట్టు వరుస ఓటములతో సతమతమవుతుండటం, బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనింగ్ భాగస్వామ్యం బలంగా లేకపోవడంతో మేనేజ్‌మెంట్ ఇక ప్రయోగాలకు స్వస్తి పలికింది. ఆఖరి మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో వైభవ్ సూర్యవంశీని తుది జట్టు నుంచి పక్కనబెట్టి, అతని స్థానంలో అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది.దీంతో సంజూ శాంసన్ ప్లేసులో భారత తుది జట్టులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. అతడికే ప్లేస్ ఇచ్చాడు. దీంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ విరామం వైభవ్ సూర్యవంశీ తన తప్పులను సరిదిద్దుకుని తిరిగి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.