ఏడేళ్లలో 4 రెట్ల రిటర్న్స్.. టాప్ స్కీంలో లక్షకు రూ. 6.24 లక్షలొచ్చాయ్.. ఫుల్ లిస్ట్ ఇదే

Wait 5 sec.

: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి విపరీతమైన రిస్క్‌తో కూడుకొని ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ తీవ్ర ఒడుదొడుకులు ఉంటాయి. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా చాలా మంది మ్యూచువల్ ఫండ్లను ఎంచుకుంటుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అతిపెద్ద బెనిఫిట్. ఇదే చక్రవడ్డీ. దీని కారణంగా కాలం గడుస్తున్న కొద్దీ సంపద పెరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. చాలా వరకు సగటున వార్షికంగా 12 శాతానికి మించి రిటర్న్స్ ఇస్తుంటాయి. ఇక్కడ సిప్ లేదా లంప్ సమ్ రెండు రకాల పెట్టుబడి ఆప్షన్లు ఉంటాయి. ఈటీ రిపోర్ట్ ప్రకారం గత 7 సంవత్సరాల వ్యవధిలో టాప్ స్కీమ్స్ ఏంటో తెలుసుకుందాం. దాదాపు 11 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇన్వెస్టర్లకు లంప్ సమ్ పెట్టుబడులపై తమ సంపదను 7 ఏళ్లలో 4 రెట్లకుపైగా పెంచడం విశేషం. మొత్తం 185 ఫండ్స్ ఉండగా ఇందులో 11 స్కీమ్స్ ఇలా కాసుల పంట పండించాయి. ఈ 11 పథకాలు వేర్వేరు కేటగిరీలకు చెందినవి ఉన్నాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఈఎల్ఎస్ఎస్ కేటగిరీలకు చెందినవి మంచి రాబడి ఇచ్చాయి.విశేషం ఏంటంటే టాప్- 6 స్కీమ్స్ స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందినవే. అత్యధికంగా ఏడేళ్లలో లంప్ సమ్ పెట్టుబడిని 6.24 రెట్లు పెంచింది. ఇక్కడ 29.89 శాతం CAGR రాబడి అందగా రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 6.24 లక్షలు చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ వరుసగా 5.19, 4.58 రెట్లు పెంచింది. అంటే లక్షకు వరుసగా రూ. 5.19 లక్షలు, రూ. 4.48 లక్షల మేర వచ్చాయి. మిగతా స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్, ఎడెల్‌వీస్ స్మాల్ క్యాప్ ఫండ్ కాగా లక్ష పెట్టుబడిపై వరుసగా రూ. 4.45 లక్షలు, 4.25 లక్షలు, రూ. 4.22 లక్షలు వచ్చాయి. తర్వాత క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ లంప్ సమ్ పెట్టుబడుల్ని 4.21, 4.20 రెట్ల మేర పెంచింది. దీంతో ఏడేళ్లలో ఇక్కడ లక్ష పెట్టుబడిపై రూ. 4.21 లక్షలు, రూ. 4.20 లక్షలు వచ్చాయి. తర్వాతి 3 మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్, క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్, ఎడెల్‌వీస్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా లక్ష పెట్టుబడిపై ఏడేళ్లలో వరుసగా రూ. 4.09 లక్షలు, రూ. 4.05 లక్షలు, రూ. 4.04 లక్షల చొప్పున రిటర్న్స్ ఇచ్చాయి. Disclaimer: పైన ఇచ్చింది సమాచారంగానే పరిగణించాలి. పెట్టుబడులకు సిఫార్సు కాదు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేసే ముందు నిపుణుల్ని సంప్రదించడం మంచిది.