నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్.. వండర్ కిడ్ వైభవ్‌కు దక్కేనా ఛాన్స్!

Wait 5 sec.

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచుకు సర్వం సిద్ధమైంది. ఇవాళ (జులై 4, 2026) మాంచెస్టర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మ్యాచుకు సైతం వర్షం ముప్పు పొంచి ఉండటంతో.. మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.ఐర్లాండ్‌తో సిరీస్‌తో పోలిస్తే.. ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచులో టీమిండియా బ్యాటింగ్ మెరుగుపడింది. సంజూ శాంసన్ మరోసారి విఫలం కాగా.. అభిషేక్ శర్మ టచ్ లోకి వచ్చాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే సైతం పరుగులు సాధించారు. అయితే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం జట్టుకు ఇబ్బంది కరంగా మారింది. తిలక్ వర్మ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుండటం ఇబ్బంది కలిగిస్తోంది. ఇక ఈ మ్యాచులోనైనా వైభవ్‌ను ఆడిస్తారా.. లేదా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. వైభవ్ మళ్లీ బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాంచెస్టర్ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. దీంతో ఇందులోనూ భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.ఇక ఎప్పట్లాగే ఇంగ్లాండ్ జట్టు.. పోరుకు ఒక రోజు ముందే తమ ప్లేయింగ్ లెవెన్‌ను ప్రకటించింది. తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన సకిబ్ మహమూద్‌తో పాటు ల్యూక్ వుడ్‌ను పక్కనపెట్టింది. వారి ప్లేసులో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌లను తీసుకుంది. సాల్ట్, బట్లర్, బెథెల్, బ్రూక్‌లతో కూడా ఇంగ్లాండ్ బ్యాటింగ్ దళం పటిష్టంగా కనిపిస్తోంది.తుది జట్లు..భారత్ (అంచనా): సంజూ శాంసన్/ , అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిఇంగ్లాండ్ తుది జట్టు: ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), టామ్ బాంటన్, విల్ జాక్స్, సామ్ కర్రన్, డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్