మారుతీ, మహీంద్రా కానే కాదు- జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే- ఎగబడ్డ జనం!

Wait 5 sec.

: భారత ఆటో మొబైల్ రంగంలో కార్ల అమ్మకాల రేసు ప్రతి నెలా ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా విడుదలైన 2026 జూన్ కార్ల అమ్మకాల గణాంకాలు మార్కెట్ దిగ్గజాలకు షాక్ ఇచ్చాయి. సాధారణంగా దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కారు అనగానే అందరికీ మారుతీ సుజుకీ మోడళ్లే గుర్తొస్తాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీనే కాగా విక్రయాలు దీనివే ఎక్కువగా ఉంటాయి. . రెండో స్థానంలో ఉన్న టాటా మోటార్స్ విక్రయాలు కేవలం 62076 గానే ఉన్నాయి. అయితే ఇక్కడ మారుతీ, టాటా, మహీంద్రా, హ్యుందాయ్ కంపెనీల నుంచి ఎన్నో మోడళ్లు, వేరియంట్ల కార్లు ఉండగా ఇందులో ఎక్కువగా ఏది అమ్ముడుబోయిందనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. మరి జూన్ నెలలో జనం ఎక్కువగా కొనుగోలు చేసిన కారు ఏంటో తెలుసా? గత ఆర్థిక సంవత్సరంలో అలానే గత కొన్ని నెలలుగా మారుతీ సుజుకీకి చెందిన మారుతీ డిజైర్ కార్లు ఎక్కువగా అమ్ముడుబోతున్నాయి. ఈసారి మాత్రం దాని స్థానం కోల్పోయింది. మారుతీ, హ్యుందాయ్, మహీంద్రా వంటి దిగ్గజాల్ని వెనక్కి నెట్టి స్వదేశీ బ్రాండ్ టాటా మోటార్స్‌కు చెందిన ఎస్‌యూవీ దేశంలోనే మోస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. మరి ఇప్పుడు జూన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితా చూద్దాం. టాటా మోటార్స్ నుంచి టాటా పంచ్ ఒక్కటే కాదు టాటా నెక్సాన్ కూడా అత్యధికంగా అమ్మడుపోయింది. ఈ రెండే టాప్- 2 లో నిలిచాయి. మారుతీ సుజుకీ నుంచి టాప్- 10 లో 6 ఉన్నాయి. మిడ్ సైజ్ ఎస్‌యూవీ విక్రయాల్లో రారాజుగా వెలుగొందిన హ్యుందాయ్ ఈసారి చాలా వెనుకబడిపోయింది. టాటా పంచ్ జూన్ నెలలో ఏకంగా 21,006 యూనిట్లను విక్రయించగా, టాటా నెక్సాన్ 18,335 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక టాప్ మోడల్‌గా కొనసాగుతూ వచ్చిన మారుతీ సుజుకీ డిజైర్ ఇప్పుడు 17,899 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానానికి పడిపోయింది. మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ , మారుతీ సుజుకీ ఎర్టిగా, స్విఫ్ట్ తర్వాతి స్థానాల్లో నిలవగా, మహీంద్రా స్కార్పియో 14,097 యూనిట్ల విక్రయాలతో 7వ స్థానంలో ఉంది. 8,9 స్థానాల్లో మళ్లీ మారుతీ నుంచి ఫ్రాంక్స్, బాలెనో ఉండగా, హ్యుందాయ్ వెన్యూ 10,776 యూనిట్ల సేల్స్‌తో పదో స్థానంలో ఉంది. టాటా పంచ్ ఆన్ రోడ్ ప్రైస్ చూస్తే రూ. 6.59 లక్షల నుంచి రూ. 12.43 లక్షల వరకు ఉంది. టాటా నెక్సాన్ ధర రూ. 8.56 లక్షల నుంచి రూ. 17.69 లక్షల వరకు ఉంది.