బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపుగా పయనించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వచ్చే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్‌పై ఈ ప్రభావం కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ వరకూ విస్తరించి ఉన్న నైరుతి రుతుపవన ద్రోణి.. వచ్చే 3 రోజులలో ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం వైపు కొనసాగుతుందని వెల్లడించారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో అల్లూరి జిల్లా, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురవవచ్చని తెలిపారు. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీడనం నేపథ్యంలో మరో నాలుగు రోజులు మత్య్సకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఈ జిల్లాలలో వానలు..మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆదివారం రోజున మేఘావృతమైన వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్లూరి, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని ప్రఖర్ జైన్ సూచించారు.