'భార్యను బొందపెట్టడం ఎలా?'.. ‘మగాళ్లను చంపడం ఎలా?'.. మెట్రోలో బుక్ వార్.. నెట్టింట వైరల్

Wait 5 sec.

మెట్రో రైల్లో ఒక యువతి చదివిన *""* నవల వైరల్ అయిన కొద్ది రోజులకే, మరో వ్యక్తి *"? – RGV"* అనే ఫేక్ బుక్ కవర్‌తో కనిపించడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. అసలు అలాంటి పుస్తకం మార్కెట్లో లేకపోయినా, ఇది మీమ్ వార్‌గా మారింది. అయితే భార్యాభర్తల మధ్య పెరుగుతున్న హత్యల నేపథ్యంలో ఇలాంటి ట్రెండ్‌లు సరదా కంటే సమాజంలో మారుతున్న మానసిక ధోరణులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ ట్రెండ్ వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లు ఒక ఫోటో, ఒక వీడియో లేదా ఒక పుస్తకం కవర్ కూడా నెట్టింట వైరల్ అయి.. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మెట్రో రైళ్లలో కనిపించిన రెండు పుస్తకాల వ్యవహారం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ బుక్ వార్ ఇప్పుడు నెటిజన్ల మధ్య ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. అందులో ఒకటి "How to Kill Men and Get Away With It" (పురుషులను చంపి, ఎలాంటి శిక్షా పడకుండా తప్పించుకోవడం ఎలా?) అనే ఇంగ్లిష్ నవల చదువుతున్న యువతి వీడియో వైరల్ కాగా.. దానికి కౌంటర్ అన్నట్టుగా "భార్యను బొందపెట్టడం ఎలా? RGV" అనే ఫేక్ బుక్ కవర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.కొన్ని రోజుల క్రితం ఓ యువతి మెట్రో రైలులో ప్రయాణిస్తూ.. బ్రిటిష్ రచయిత్రి కేటీ బ్రెంట్ రాసిన "How to Kill Men and Get Away With It" అనే సైకలాజికల్ థ్రిల్లర్ నవలను చదువుతూ కనిపించింది. అయితే ఆ బుక్ పూర్తిగా కల్పిత కథ ఆధారంగా రాసిన ఫిక్షన్ నవల అయినప్పటికీ.. ఒక యువతి మెట్రోలో చదవడంతో.. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారీ ఎత్తున చర్చ జరిగింది. ఇటీవల మహిళలు, పురుషుల మధ్య జరుగుతున్న నేరాల నేపథ్యంలో కొందరు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఆ యువతి చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో వివాదం నెలకొంది. ఈ వివాదం ఇంకా చల్లారకముందే ఒక వ్యక్తి మెట్రోలో చేసిన పని దానికి కౌంటర్‌గా మారింది. "భార్యను బొందపెట్టడం ఎలా? – RGV" అనే టైటిల్‌తో ఉన్న పుస్తకాన్ని చదువుతున్నట్లు ఒక యువకుడు కనిపించాడు. దీంతో ఆ వ్యక్తి ఫోటో, వీడియోలను కొంతమంది ప్రయాణికులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. మగాళ్లను చంపే పుస్తకానికి ఇదే కౌంటర్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తూ.. మీమ్స్ షేర్ చేస్తున్నారు.అయితే.. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. "భార్యను బొందపెట్టడం ఎలా?" అనే పేరుతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గానీ.. ఇంకో రచయిత గానీ ఎలాంటి పుస్తకం రాయలేదు. అసలు మార్కెట్లో అలాంటి పుస్తకమే అందుబాటులో లేదు. వైరల్ అయిన వీడియోలో కనిపించింది కేవలం ఒక నకిలీ బుక్ కవర్ మాత్రమేనని అర్థం అవుతోంది. యువతి చదివిన మగాళ్లను చంపడం ఎలా అనే బుక్‌కు కౌంటర్‌గా సోషల్ మీడియాలో చర్చకు తెరలేపేందుకే ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఆ కవర్‌ను తయారు చేసి మెట్రోలో ప్రదర్శించినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాన్ని చాలామంది సరదా మీమ్ వార్‌గా చూస్తున్నప్పటికీ.. మరోవైపు సమాజంలో పెరుగుతున్న భార్యాభర్తల మధ్య వివాదాలు, కుటుంబ హింస, హత్యలు వంటి ఘటనల నేపథ్యంలో ఇలాంటి శీర్షికలు వైరల్ కావడం ఆలోచింపజేస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ వెలుగులోకి వస్తున్న భార్యాభర్తల హత్యల వార్తల మధ్య ఇలాంటి 'బుక్ వార్' వినోదాన్ని పంచుతూనే సమాజంలోని మారుతున్న మానసిక ధోరణులపై కూడా చర్చకు దారితీస్తోంది.